Saturday, July 29, 2017

GWMIMP:దేశీయ ఆవు ( నాటు ఆవు )


  దేశీయ ఆవు  ( నాటు ఆవు )

           భారతదేశంలో పాలు కేవలం ఒక పానీయం కాదు. పాలు ఒక అమృత తుల్యమని భావిస్తారు. ప్రతి భారతీయుడు పేద ధనిక వ్యత్యాసం లేకుండా రోజుకొక గ్లాసుడు నాటుఆవు పాలు త్రాగడాన్ని శక్తివంతమైన , పవిత్రమైన సంపూర్ణ ఆరోగ్య ప్రధాయినే కాక సాత్వికమైన శ్రేయస్కరమైన జీవన్నాన్ని అందిస్తుందని తరతరాల నమ్మకం. విశ్వాసం భారతీయుల మనస్సులలో నాటుకొనివుంది. పిల్లలు , యువకులు , వృద్ధులు అన్ని వయస్సుల వారికి నాటు ఆవు పాలు ప్రాధమిక పోషణను అందిస్తుంది. దాదాపు 63 శాతం ప్రొటీన్లు ( మాంసకృతులు ) మనకు పాల ఉత్పత్తుల ద్వారానే లభిస్తుంది. శాకాహారులకు మాంసకృత్తుల కోసం వేరే ప్రత్యామయం లేదు.

వేదానుసారంగా .......

         హిందూ ధర్మం , సంస్కృతిలో ఆవుని పవిత్రంగా భావిస్తాం , ఆవుని గోమాతగా , కామధేనువుగా  పూజిస్తుంటాం. కామధేనువును సమస్త లోకాలకు తల్లిగా భావిస్తాం.

మాతాః సర్వభూతానామ్
గావహః సర్వసుఖప్రదః

    గోమాత ఎంత పవిత్రమైనదంటే సర్వ దేవీ - దేవతలు , మునులు గోమాత శరీరంలో స్ధిరమైన స్ధానంలో ఉంటారు. పవిత్ర గోమాత నుండి లభించే పంచగవ్వాలు ( పాలు , పెరుగు , నెయ్యి , గోమయం , గోమూత్రం ) మానవజాతి అభివృద్ధిలో పాలుపంచుకుంటాయి.

ఆవు పాలు అభిషేకానికి , ప్రసాదాలకు శ్రేష్టమైనది.

చరక సంహిత.....

           ప్రాచీన భారతీయ వైద్య గ్రంధం ప్రకారం దేశీయ ఆవు ఉత్పాదనలు అన్ని రకాల రోగాలకు రామబాణంలాంటి ఔషధంగా అభివర్ణించబడింది.

నేషనల్ బ్యూరో ఆప్ యానిమల్ జెనెటిక్ రిసెర్చ్  తన పరిశోధనలో వెల్లడించిన ఫలితాల ప్రకారం భారతీయ దేశీ ఆవుపాలల్లో ప్రోలైన్ అనే అమినో యాసిడ్లు , ఇన్సొల్యూసిన్ అనే మరో అమినోయాసిడ్ తో సుదృఢంగా కలిసి వుందని నిరూపతమైనది. అలాంటి గుణాలున్న పాలను A2  పాలు అంటారు. ఊబకాయం , కీళ్ళనొప్పులు , ఆస్తమా , మానసిక రుగ్మతలతో పోరాడుతుంది. A2  పాలల్లో అత్యధిక శాతం ఉండే ఓమేగా 3 , రక్తనాళాల్లో ఉండే కొలెస్ట్రాల్ను  శుభ్రపరుస్తుంది. A2 పాలల్లో ఉండే సెరెబ్రోసైడ్స్ మెదడు చురుకుగా పనిచేసేందుకు , స్ట్రాంటియం శరీరం యొక్క రోగనిరోధక శక్తిని పెంచి హానికరమైన రేడియేషన్ నుండి కాపాడుతుంది.

జై గోమాత...... జైజై విశ్వమాత


    🇮🇳   భారతీయుడు. 🙏

No comments: