Saturday, July 22, 2017

GWIMP:స్వామి రామా....

స్వామి రామా....

ఒక సారి స్వామి రామా జపాన్ వీధుల్లో నడచి వెళుతూ ఉంటే ఆయనకు ఒక ఆశ్చర్యకరమైన విశేషం కనిపించింది.

పెద్ద పెద్ద వృక్షాలను చిన్న చిన్న ప్లేట్లలో చిన్న చిన్న ఆకారాలతో అమ్ముతున్న షాపు కనిపించింది.

ఆయనకు చాలా ఆశ్చర్యం వేసింది.  ఇంత పెద్ద వృక్షాలను చిన్నవిగా ఎలా చేయగలిగారు.  అదే విషయాన్ని షాపు వాడి దగ్గరకు వెళ్ళి అడిగాడు.

షాపు వాడు స్వామికి వినయంగా నమస్కరించి.  స్వామీ ఇది ఏమీ పెద్ద విషయం కాదు.  ఇది మా జపనీయుల ప్రత్యేక కళ.  దీనిని బోన్సాయ్ అంటారు (మొరగుజ్జు వృక్షాలు).  భూమిపైన చెట్టు ఎలా పెద్దద్దిగా పెరుగుతుందో అలాగే భూమి లోపల ఆచెట్టుయొక్క వేర్లు పెరుగుతూ పోతాయి.  మనం ఆ వేర్లను జాగ్రత్తగా కత్తిరిస్తూ ఉంటే భూమి పైన మొక్క ఎదుగుదల ఆగి పోతుంది.

ఇది విన్న స్వామి తన గదికి తిరిగి వచ్చి తన డైరీలో ఇలా రాసుకున్నాడు.  "ఇది ఎంత సత్యం వృక్షాలకు మనషులకు ఎంత దగ్గర సంబంధం ఉంది.  మానవులకు తమ సంస్కృతి అనే వేర్లను కత్తిరిస్తే ఆ జాతి ఎదుగుదల ఆగి పోతుంది."

ఇది ఎంత సత్యమో ఆలోచించండి హిందువుల  విషయంలో ఇదే జరిగింది.  మన హైందవ జాతి సంస్కృతి అనే వేర్లు కత్తిరించ బడ్డాయి.  అందువలననే హైందవ జాతి ఎదుగుదల లేక మొరగుజ్జు వృక్షంగా మిగిలి పోయింది.  మరలా హైందవ జాతి మహా వృక్షంగా ఎదగాలంటే సంస్కృతిని పునరుజ్జీవితం చేయాలి.

హైందవ సంస్కృతీ పునరుజ్జీవం జరగాలి.  ఘాఢ సుషుప్తిలో ఉన్న హైందవ జాతి మేల్కోవాలి.

No comments: