హెచ్‌ఐవీని గోవు నయం చేయగలదు .. కొత్త ఆశలు రేకెత్తిస్తున్న తాజా పరిశోధన
' హిందువులు పవిత్రంగా పూజించే గోవు.. ప్రపంచాన్ని వేధిస్తున్న హెచ్‌ఐవీ చికిత్సలో కొత్త ఆశల్ని రేకెత్తిస్తోంది.
************************************************
* హెచ్‌ఐవీని సమర్థంగా అడ్డుకునే ప్రతిరక్షకాలు ఆవుల్లో వూహించనంత వేగంగా అభివృద్ధి చెందడాన్ని తాజాగా గుర్తించారు.
* హెచ్‌ఐవీపై పరిశోధనల్లో భాగంగా శాస్త్రవేత్తలు.. నాలుగు ఆవు దూడలకు హెచ్‌ఐవీ ఇమ్యునోజన్స్‌ను ఇంజక్షన్ ద్వారా ఎక్కించారు. అనంతరం ఆ దూడల రక్తంలో హెచ్‌ఐవీ ప్రభావాన్ని నిరోధించే ప్రతిరక్షకం వెంటనే అభివృద్ధి కావడం వారిని విస్మయపరిచింది. వాటిలో ‘ఎన్‌సీ-సీఓడబ్ల్యూ 1’ అనే ప్రతిరక్షకం హెచ్‌ఐవీని ఎదుర్కోవడంలో ప్రభావవంతంగా పనిచేసినట్లు గుర్తించారు.
* ఆవులోని రోగ నిరోధక శక్తి ఇలాంటి ప్రతిరక్షకాలను వెంటనే ఎలా తయారు చేయగలుగుతుందో అర్థం చేసుకోవడానికి ఈ అధ్యయనం ఉపయోగపడనుంది. ఈ ప్రక్రియను మనుషుల్లోనూ అనుకరించగలిగితే హెచ్‌ఐవీ టీకా సాధ్యమవుతుందని భావిస్తున్నారు.
* ఈ ఫలితాల ఆధారంగా మనుషులపై ప్రయోగాలకు సిద్ధమవుతున్నారు. అమెరికాకు చెందిన స్క్రిప్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, ది ఇంటర్నేషనల్ ఎయిడ్స్ వ్యాక్సిన్ ఇనిషియేటివ్ (ఐఏవీఐ), టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్సిటీ పరిశోధకులు జరిపిన ఈ అధ్యయనం వివరాలు ‘నేచర్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

No comments:
Post a Comment