Sunday, July 9, 2017

46.విరుద్ధ వస్తువులు

మన ఆరోగ్యం ..... మన చేతుల్లో ( 46 )

👽 విరుద్ధ వస్తువులు.....

      మనం భోజనం చేసేటప్పుడు ఆహారంలో గుణం , స్వభావము వేరుగా ఉన్న పదార్థాలు తినకూడదు.

వాగ్బటులు చెప్పిన విరుద్ధ వస్తువులు ......

👽 ఉల్లిపాయ + పాలు ఇవి రెండు ఒక దానికి మరొకటి ఒద్ధ శత్రువులు. ఇవి రెండు కలిపి తీసుకుంటే చర్మ సంబంధమైన ఎన్నో జబ్బులు వచ్చి చేరుతాయి. గజ్జి , సోరియాసిన్ , ఎగ్జిమా , దురదలు లాంటివి

👽 పనసకాయ + పాలు , ఇంకా పాలతోటి సిట్రిక్ యాసిడ్ ఉండే ఏ పదార్ధము కూడా తీసుకోకూడదు. సిట్రిక్ యాసిడ్ ఉండేవి కమలాపండు , బత్తాయి , నారింజ , ద్రాక్ష వంటి పుల్లటి పదార్ధలు. పాలతోపాటుగా తీసుకోదగిన ఒకే ఒక పుల్లటి పదార్ధం ఉసరికాయ. దీనిలో సిట్రిక్ యాసిడ్ , సి. విటమిన్ , కాల్షియం పరిపూర్ణంగా ఉంటాయి. అయినా కూడా ఉసరికాయ మాత్రమే పాలతో కలిపి తీసుకోదగినది. ఇక ఏ పుల్లటి పదార్ధమైనా మామిడికాయ కూడా పాలతో తీసుకోకూడదు. పుల్లగా ఉంటే . పాలతో తియ్యటి మామిడికాయ తీసుకోవచ్చును.

👽 నెయ్యి + తేనె కలిపి తీసుకోకూడదు.

👽  మినపప్పు + పెరుగు పొరపాటుకైనా కలిపి ఒకేసారి తీసుకోవద్దు. పప్పులన్నింటికి రారాజు మినపప్పు , ఇది ద్విదళం. కావున దీన్ని తీసుకుంటే ఒక్కటిగానే తీసుకోవాలి. దీనితో కలిపి పెరుగు ( పెరుగు ఆవడ) వడ తీసుకోకూడదు. ఇక పెసర పప్పు , కంది పప్పు వంటి వాటితో కలిపి పెరుగు తీసుకోకపోవటమే మంచిది. ఒక వేళ తీసుకోవలసి వస్తే పెరుగులో తాలింపు వేసుకుని తినాలి , మినపప్పుతో మాత్రం పెరుగు కలిపి ఎట్టి పరిస్థితిలో తినకూడదు.

      " ఆరోగ్యమే .... మహా భాగ్యం "

               శ్రీ రాజీవ్ దీక్షిత్. 💐

Collected and typed by: Ram Prasad Gaaru



Loving-Serving-Saving Cow-Bull (Nature asset) is nothing wrong
Vishnu@Goseva world 

No comments: