Sunday, July 9, 2017

43.కాఫీ , టీ ల గురించి .....

మన ఆరోగ్యం .... మనచేతుల్లో ( 43 ).

కాఫీ , టీ ల గురించి .....

      వాగ్భటుని సూత్రాలలో టీ , కాఫీ గురించి లేదు. ఎందుకంటే వారి కాలంలో అవి లేవు. కానీ వారు కషాయం గురించి చెప్పారు. ఈ కషాయం త్రాగితే మీకు వాతము , పిత్తము , కఫము సమంగా ఉంచుతుంది. అర్జున వృక్షం బెరడు దీనితో కషాయం తాగితే అన్నిటికన్నా ముందుగా వాతాన్ని తగ్గిస్తుంది. అలాగే కడుపులోని ఎసిడిటీలాగే రక్తంలో కూడా ఎసిడిటి ఉంటుంది. దాని వల్లనే గుండె పోటు వస్తుంది. దీన్ని నివారించటానికి చాలా ముఖ్యమైనది ఈ అర్జున చెట్టు బెరడు. ఇలాంటి కషాయమైతే మీరు పాలతో కలిపి తీసుకోవచ్చును. ఎక్కువగా నవంబర్ , డిస్ంబర్ , జనవరి వంటి చల్లని రోజులు వాతపు రోజులు. దేహంలో వాయు ప్రకోపం చల్లని రోజుల్లో ఎక్కువగా ఉంటుంది. ఆ రోజుల్లో ఈ అర్జున వృక్షం బెరడుతో చేసిన కషాయం త్రాగితే మీకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఇది వేడిగాను తోసుకోవచ్చును. పాలతో కలుపు కోవచ్చును. ఇది మీకు రక్తాన్ని శుద్ధి చేసి, రక్తంలోని మలినాలను కూడా బయటకు పంపుతుంది. కొలెస్ట్రాల్ ను నియంత్రిస్తుంది. కనుక మీరు నవంబర్ , డిసెంబర్, జనవరి కాలంలో అర్జున చెట్టు బెరడుతో కషాయం చేసుకుని త్రాగండి. భవిష్యత్తులో గుండె జబ్బులు రాకుండా జాగ్రత్త పడండి. కొలత ఒక గ్లాసు పాలతో అరస్పూను అర్జున చెట్టు బెరడు పొడి కలిపి దీనిలో బెల్లం తీసుకుంటే మంచిది. రంగు కలపని బెల్లం లేకుంటే పటిక బెల్లం మంచిది. శొంఠి కూడా కలిపితే ఇంకా మంచిది.

      టీ త్రాగడం వల్ల వచ్చే ప్రమాదం అందులోని చక్కెర వల్లనే , ఈ చక్కెరకి టీకి సరిపోదు. మీరు  భారతదేశ వాసులు కాబట్టి ఇక్కడి వాతావరణానికి టీ - కాఫీ మంచిదికాదు. కానీ మీకు అలవాటుయ్యింది మానుకోలేం , అంటే టీలో చక్కెర బదులుగా బెల్లం వేసుకోండి. ఎందుకంటే బెల్లం క్షారగుణం కలిగినది. చక్కెర ఆమ్లగుణం కలిగినది. పంచదార జీర్ణమయ్యాక యాసిడ్ మిగులుతుంది. మీ కడుపులో ఎప్పటికీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఉదయం పంచదార కలిపిన టీ ని తీసుకుంటే మీలోని ఎసిడిటీని ఇంకా పెంచుతుంది. కనుక మీరు టీ త్రాగాలంటే బెల్లంతో చేసిన టి ని త్రాగండి , పాలు వేసుకోకుండా టీని త్రాగండి. దీన్ని బ్లాక్ టీ అంటారు. ఇందులో నిమ్మకాయ రసం పిండీకోండి. ఇది చాలా మంచిది. కాని దీనికంటే ముందు మంచి నీరు గుటక గుటకగా స్విప్ చేస్తూ త్రాగండి , మరచి పోకండి. ఇంకా మీకు టీ కొరకు బజారులో దొరికే పొడి ఎంతమాత్రమూ మంచిదికాదు. ఆకులతో తయారు చేసిన టీ పొడి దొరికితే తీసుకొండి. చాలా మంచిది.
  " ఆరోగ్యమే .... మహాభాగ్యం "

                   శ్రీ రాజీవ్ దిక్షిత్  💐
Collected and typed by: Ram Prasad Gaaru



Loving-Serving-Saving Cow-Bull (Nature asset) is nothing wrong
Vishnu@Goseva world 

No comments: