Wednesday, July 12, 2017

41.ఆరోగ్య సూత్రాలు ......

మన ఆరోగ్యం ....... మనచేతుల్లో ( 41 ).

ఆరోగ్య సూత్రాలు ......

భోజనం చేసిన తర్వాత వెన్న లేని మజ్జిగ లేక రసం ఎందుకు త్రాగవలెను ?

      మజ్జిగలో , రసముల్లో , పాలల్లో కూడా నీటి శాతం ఉంటుంది. కానీ వాగ్భటులు చెప్పేది ఎమంటే నీటికి సొంతంగా ఏ గుణం ఉండదు. నీటిని ఏ పాత్రలో ఉంచితే లేదా వేటితో కలసినా ఆ గుణాలనే అది స్వీకరిస్తుంది. ఇది నీటి ధర్మం. అంటే పెరుగుతో కలిపితే అది పెరుగులోని గుణాలనే స్వీకరించి ఆ గుణాన్నే అందిస్తుంది. అలాగే పండ్లరసాలతో కలిసినా ఇంకా పాలల్లో కలిపినా అదే గుణాలని అందిస్తుంది నీరు. కాబట్టి భోజనం చేసినా తర్వాత కేవలం నీరు త్రాగితే అది జఠరాగ్నిని చల్లబరుస్తుంది. కనుక పాలు , మజ్జిగ , పండ్లరసములు ఎంత్తెన త్రాగవచ్చు. ఇక పెరుగుకి ఉన్న గుణం అగ్నిని ప్రదీప్త చెయ్యటం. ఎందుకంటే పెరుగులో ( స్నిగ్ధత్వం ) ఫ్యాట్ ఉంది. పెరుగులో పాలలో కంటే ఎక్కువ వుంటుంది. వెన్నలో పెరుగులో కంటే ఎక్కువ ఉంటుంది. వెన్నలో కంటే నెయ్యిలో ఎక్కువ ( స్నిగ్ధత్వం) ఫ్యాట్ ఉంది. ఏ పదార్ధంలో ఎక్కువ ఫ్యాట్ ఉంటుందో అది అగ్నిని ఎక్కువ ప్రదీప్తం చేస్తుంది. ఎలాగంటే యజ్ఞలంలో నెయ్యి వేస్తే అగ్ని ఎలా ప్రజ్వలిస్తుందో అలాగే పొట్టలో కూడా పెరుగు తిన్నా , పాలు త్రాగినా , ఇంకా వెన్న , నెయ్యి తిన్నా అగ్ని ప్రదీప్తమవుతుంది. దానితో భోజన్నాన్ని ఇంకా బాగా పచనం చేస్తుంది. ఎంతో మేలు జరుగుతుంది. కనుక కేవలం మంచినీరు మాత్రం త్రాగకండి.

      " భోజనాంతే విషం వారీ " అంటే భోజనం చివర నీరు త్రాఖటం విషంతో సమానము. మనం తీసుకున్న ఆహారం మొదట జీర్ణాశయానికి చేరుతుంది. అక్కడ అగ్ని ప్రదీప్తమవుతుంది. ఆ అగ్ని తిన్న ఆహారాన్ని పచనం చేస్తుంది. ఇది ప్రధానమైన విషయం.

      భోజనం తరువాత తీసుకోతగిన ఉత్తమమైన పదార్ధాలు --- పండ్లరసాలు , మజ్జిగ , పాలు. మనం ఎల్లప్పుడు పండ్లరసాలను ( ఆయా ఋతువుల్లో వచ్చే పళ్ళు మాత్రమే ) ,  ఉదయం భోజనాంత‌రము , మజ్జిగ మధ్యాహ్న భోజనాంతరం , పాలు రాత్రి భోజనాంతరము మాత్రమే త్రాగాలి. ఈ క్రమాన్ని ముందు వెనుకలుగా చెయ్యవద్దు , ఎందుకంటే ఆయా సమయాల్లో మాత్రమే త్రాగాలి. ఈ క్రమాన్ని ముందు వెనుకలుగా చెయ్యవద్దు , ఎందుకంటే ఆయా సమయాల్లో మాత్రమే ఆయారసాలను పచనం చేసే ఎంజైమ్స్ ఆ శక్తి మన శరీరంలో ఉంటుంది.

      పై విధంగా ఆచరించి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందండి.

  " ఆరోగ్యమే ..... మహాభాగ్యము. "

         శ్రీ రాజీవ్ దీక్షిత్ .💐

Collected and typed by: Ram Prasad Gaaru



Loving-Serving-Saving Cow-Bull (Nature asset) is nothing wrong
Vishnu@Goseva world 

No comments: