గోమాత మహత్యం
------------------------
ఏ శుభకార్యమైనా గోమాత సంబంధం లేక పూర్తి కాదు. ఉదాహరణకు ”గృహప్రవేశం చేసుకుంటే, ఆ కొత్త ఇంట్లో ముందుగా ఆవ్ఞనే ప్రవేశపెడతారు. జీవ్ఞలను తరింపజేసే దివ్యఔషధశాల గోమాత! గోవు పంచగవ్యప్రాసనం ”కేన్సర్‌ని నివారిస్తుందట! ”గోశాలలు, గోష్ఠములు సకలవ్యాధి నిరోధక స్థానములని, గోమూత్రం, గోమయం, పిడకల పొగ, ప్లేగు వంటి భయంకర వ్యాధి క్రిములను నశింపజేస్తాయని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. గోమాత ”అంబారవం వల్ల కాలుష్యం నివారింపబడుతుందట. ఆమె వేదమాతృస్వరూపిణి; లోకపావని, సంతానం కోసం పరితపిస్తున్న దిలీపమహారాజుకి గోవ్ఞను సేవిస్తే కోరిక తీరుతుందని సలహా ఇచ్చాడట. వశిష్ట మహర్షి గోవు, గోవిందునికి ప్రియమైనది కాబట్టి రోజూ నమస్కరిస్తే, శుభం కలుగుతుందని చెప్పాడట. ఆవ్ఞపాలు, పెరుగు, వెన్న, నెయ్యి, అన్నీ శ్రేయోదాయకాలే! గోవ్ఞలను సేవించే ప్రాంతాల్లో అతివృష్ఠి, అనావృష్ఠి ఉండవని పురాణాలు, శాస్త్రాలు తెలుపుతున్నాయి. ఆవునెయ్యి అగ్నిపై వేస్తే వచ్చే పొగ వాతావరణ కాలుష్యాన్ని నివారిస్తుందట.
యజ్ఞయాగాదులు నిర్వహిస్తే రేడియో ధార్మిక కిరణాల నుండి రక్షణ లభిస్తుంది. ఒక తులం ఆవ్ఞనెయ్యితో యజ్ఞం చేస్తే ఒక టన్ను ఆక్సిజన్ లభిస్తుందట. ఆవ్ఞపాలలో అటమిక్ రేడియేషన్ నుండి రక్షణ పొందగల శక్తి లభిస్తుందని రష్యా శాస్త్రవేత్త శిరోవిద్ పేర్కొన్నారు. ఆవ్ఞ వెన్నెముకలో సూర్యకేతునాడి ఉంటుందని, సూర్యుని ప్రకాశంతో చేతన పొందిన ఆ నాడి, ఒక పచ్చని పదార్థాన్ని విడుదల చేస్తుందని, దాన్నే గోరోజనం అంటారు. దాంట్లో విషాన్ని హరించే శక్తి ఉందని అంటారు. ఆ పదార్థం వల్లనే ఆవ్ఞపాలు పచ్చగా ఉంటాయి. ఒకప్పడు భారతదేశం కరువు కాటకాలతో అల్లాడిపోతూ ఉంటే రుషులు వేడుకోగా, దేవతలు సురభిని భూమిపైకి పంపారట! ఆమె సంతానమే గోవ్ఞలని పురాణాల వల్ల తెలుస్తోంది. గోవుకి సాటియైనది ఏదీ లేదని వేదాలు ఘోషిస్తున్నాయి. సాక్షాత్తూ లక్ష్మీస్వరూపిణిగా భావిస్తారు. ధర్మ,అర్థ, కామ, మోక్షములు ఆవు పొదుగు నాలుగు స్థానాల్లోనూ ఉన్నట్లుగా సంత్ తులసీదాసు వర్ణించారు. సంత్ మహాదేవ్ ఢిల్లీ పాదుషా కోరగా, చనిపోయిన ఆవును బ్రతికించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడట. సిక్కుల గురువుగోవింద్ సింహ్ చండీదీవార్‌లో గోరక్షణకై దుర్గాభవాని దీవనలు పొందాడు. జైనులు కూడా గోవ్ఞను చంపడం మహాపాప మని నమ్ముతారు. మహావీరుడు మనుజుల కన్నా రక్షణ మిన్న అన్నాడు. ఏసుక్రీస్తు గోవును చంపడం మనిషిని చంపడమే అన్నాడు. స్వరాజ్యప్రాప్తికి గోరక్షణ ముఖ్యమైనది అంటూ గాంధీజీ చెప్పేవారట. శ్రీబాలగంగాధర తిలక్ గోవధను నిషేధించారు.
గోవధను నిషేధించి తీరాలని శ్రీజయప్రకాష్ నారాయణ్ అన్నారు. హిందువ్ఞలు ఆవ్ఞని, పారశీకులు ఆంబోతును ఆరాధిస్తారు. పారశీకులు ప్రాచీన నాణాలపైన, పిరమిడ్లపైన, ఎద్దుబొమ్మలు ఉంటాయి. శ్రీకృష్ణుడు ”ఇంద్రపూజనుమాన్పించి, గోపూజను చేయించగా, ఇంద్రుడికి కోపం వచ్చి, ఉరుములు మెరుపులతో కుండపోతగా వర్షం కురిపించాడట. కృష్ణుడు తన చిటకెన వ్రేలుపై గోవర్ధనగిరిని ఏడురోజుల పాటు ఎత్తిపట్టుకొని, గోవ్ఞలను, దూడలను, గోపీజనాన్ని రక్షించాడట. ”భా అంటే ”తేజస్సు. తేజస్సును ఆరాధించేవారే ”భారతీయులు. నక్షత్ర, గ్రహ తారాదుల దివ్యకిరణ ప్రతిరూపాలే గోవులు. కాబట్టి గోపూజ చాలా శ్రేష్ఠమైనది.
No comments:
Post a Comment