మన
ఆరోగ్యం .... మనచేతుల్లో ( 35)
భోజనం చేసిన వెంటనే నీళ్ళు త్రాగరాదు. గండన్నర తర్వాత నీళ్ళు త్రాగాలి. ఇలా త్రాగడం వలన బరువు తగ్గుతారు , తేలికగా అవుతారు , ఆరోగ్యవంతులుగా అవుతారు. నీటిని కూర్చుని త్రాగాలి , నిలబడి త్రాగకండి. చల్లటి నీటిని త్రాగవద్దు. ఎప్పుడూ గోరు వెచ్చని నీటినేత్రాగండి. ఎండాకాలములో ( మార్చి నుండి జూన్ ) మట్టితో చేసిన కుండలోని నీరు త్రాగవచ్చును. గుండ్రంగా ఉన్న పాత్రలోని నీటిలో సర్ఫేస్ టెన్షన్ తక్కువగా ఉంటుంది. కావున అటువంటి పాత్రలోని నీటినే త్రాగవలెను. గ్లాసు వద్దు. గుండ్రని చెంబులో ఉన్న నీటికి సర్ఫేస్ టెన్షన్ తక్కువగా ఉంటుంది. కనుక త్రాగడానికి శ్రేయస్కరం. ఈ నీటిని త్రాగితే
కడుపులోని పేగులు విచ్చుకుని మలినాలన్నీ బయటకు పంపుతుంది. సర్ఫేస్ టెన్షన్ ఎక్కువగా ఉన్న నీటిని త్రాగితే ప్రేగులు ముడుచుకుని పోతాయి. దీని వల్లనే మూలశంక , భగంధర్ రోగాలు వస్తాయి. అందుకనే మీరు గుండ్రని ( చెంబు ) లోని నీటినే త్రాగండి.
ప్లాస్టిక్ బాటిల్ లోని నీటిని ఎప్పుడూ త్రాగరాదు. ఎందుకంటే ఆ నీటిలో సర్ఫేస్
టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. అటు వంటి నీరు అరోగ్యానికి మంచిది కాదు.
." ఆరోగ్యమే .... మహాభాగ్యం "
శ్రీ రాజీవ్ దీక్షిత్ ....
No comments:
Post a Comment