మన ఆరోగ్యం .... మనచేతుల్లో
( 34 )
🐄 గోమాత విశిష్టత ......
భగవంతుడు భారతదేశంలో మనకిచ్చిన గొప్పవరం గోమాత. ఎలాగంటే మానసిక రోగాలు , డిప్రెసన్ సమస్యలు వున్నవారు రోజూ వుదయాన్నే నిద్రలేవగానే వెళ్ళి గోశాలలో కూర్చుని గోవుని చూస్తూ వుంటే చాలు వారి డిప్రెషన్ తొలగి పోతుంది. ( జెర్సీ ఆవులు కాదు ) దేశవాళి గోవులకు మూపురం వుంటుంది. జెర్సీ ఆవుకు వుండదు. జెర్సీ ఆవు ఎప్పుడూ కూర్చొని వుంటుంది. మీరు నిలబెట్టినా అది మళ్ళీ కూర్చుని వుంటుంది బద్ధకంగా. ఒక వేళ మీరు
దాన్ని తిప్పినా అది మూలుగుతూ తిరుగుతుంటుంది. ఈ జెర్సీ ఆవు
మూత్రంలో 3 రకాల పోషకాలు మాత్రమే వుంటాయి.
దేశవాళీ గోవు ఎప్పుడూ తిరుగుతూ వుంటుంది. ఈ గోవు యొక్క
మూత్రం ఎంతో విలువైనది , ఉపయోగకరమైనది. గోమయంలో మహలక్ష్మీ వున్నది. రైతులు ఏ పంట అయినా
, యూరియాలు ,మందులు కాకుండా గోమయంతో ఎలా చెయ్యాలో తెలుసుకుని ఆ విధంగా పంటలు
పండిస్తే ఎంత గొప్ప దిగుబడి వుంటుందో వారే తెలుసుకోవచ్చు. గోవు పేడతో గ్యాస్ వస్తుంది. దీనితో వంట చేసుకోవచ్చును , వాహనాలు నడపవచ్చు.
మనం గ్యాస్ కోసం బిచ్చగాళ్ళలాగా , ఇరాన్ ,ఇరాక్ దేశాల వాళ్ళ దగ్గర ఎదురు చూపులు చూస్తూవుంటాం. ఈ బాధలు తొలగాలంటే
మనం ప్రతి గ్రామంలోను గోవులను పెంచుకుంటూ మనమే దాన్ని విలువలను తెలుసుకుని మనవారందరికీ తెలియ జేసి అందరం కలిసి ఆచరించితే భారత దేశం గోమాత వల్ల సస్సశ్యామాలంగా అవుతుంది.
జై గోమాత ..... జైజై
విశ్వమాత.
....... శ్రీ
రాజీవ్ దీక్షిత్ .... 🙏
No comments:
Post a Comment