👫 మన ఆరోగ్యం ... మనచేతుల్లో.(
30 )
పిల్లల
గురించి ......
పిల్లలు కఫ ప్రభావానికి లోనై
వుంటారు. కనుక వారికి వచ్చే రోగాలు ఈ భాగానికి చెందినవై
వుంటాయి , ముక్కు కారటం ,దగ్గు , జలుబులు ఇలా వుంటాయి.
పిల్లలకు ఈ కఫం దోషపూరితం
కాకుండా చూసుకోవాలి. పిల్లలకు మాలీష్ చేయడం ద్వారా కఫంను తగ్గించ వచ్చును. పిల్లలకు శరీరమంతా మాలీష్ చెయ్యండి. కఫం ఎక్కువగా ఉండే స్ధానాలు తల , చెవులు బాగా మాలీష్ చెయ్యాలి. చెవుల్లో నూనె కూడా వేయవచ్చును. ఇంకా పిల్లలకు చాలా మంచిది కాటుక.
పిల్లలకు చెమట పట్టేవరకు మాలీష్ చేసిన తర్వాత స్నానం చేయించండి. శనగపిండి లేక గంధపు చెక్క లేక ముల్తాని పౌడర్ తో స్నానం చేయించండి.
పై పదార్ధలన్నియు కఫాన్ని అదుపులో వుంచుతాయి. సబ్బులు ( Soaps) ని వాడవద్దు. ఎందుకంటే
సబ్బుల్లో సోడియం హైడ్రాక్సైడ్ ( కాస్టిక్ సోడా ) ఇది కఫాన్ని రెచ్చగొడుతుంది. కనుక సున్నిపిండి వంటివే కఫాన్ని తగ్గిస్తుంది. కాబట్టి పిల్లలకు స్నానం శనగపిండి ( సున్నిపిండి ) తోనే చేయించండి.
పడుకునే ముందు టి.వి. ని
దూరంగా ఉండనీయండి. వారు పెందలాడే పడుకుంటారు , లేదంటే పిల్లలు కఫ ప్రభావానికి లోనై
వుండటం వల్ల వారు కార్టూన్ చాన్ ల్స్ చూస్తారు. ఎందుకంటే కఫానికి లోనైన వారు కల్పాతాలకు ఇష్టపడతారు.
కఫం సమతుల్యంగా ఉంటే వారిలో ఎంతో సృజనాత్మకతును పెంచుతుంది , వ్యక్తిని వైజ్ఞానికునిగా చేస్తుంది. అదే కఫం దోషపూరితమైతే అందరినీ మించిన నేరస్తునిగా చేస్తుంది.
పిల్లలు కఫప్రభావంతో వుండటం వల్ల వారిని ఆలోచింప చేసేవాటికి వారు ఇష్టపడతారు. అందుకే వారికి మంచి మహావీరుల , దేశభక్తుల కధలను వినిపించండి , చాలా మంచిది.
పిల్లలు ఏదైన ప్రశ్న వేసిన అది వారి కాల్పనికతను పెంచుకోవటానికే అని గుర్తించండి. మీకు తెలియకపోతే , మీరు తెలుసుకుని వారికి అర్ధమయ్యేలా చెప్పండి. అంతేకానీ , దేవుడు చేశాడు అని ఇంకేదో ఒకటి చెప్పకండి. కొద్ది రోజుల తర్వాత వారు నిజం తెలుసుకున్నాక ఇక మిమ్మల్ని ఏమాత్రం
గౌరవించరు.
అన్నింటికన్నా కష్టమైనది పిల్లల్ని పెంచటం.
" ఆరోగ్యమే .... మహాభాగ్యం "
No comments:
Post a Comment