Saturday, July 29, 2017

29.పిల్లల గురించి-1 ...GWR

⛹🏼 మన ఆరోగ్యం .... మనచేతుల్లో ( 29 )

పిల్లల గురించి .......

      వాగ్భటులు అంటారు అన్నింటికన్నా కష్టమైనది పిల్లలని పెంచడం.

      మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే వాత , పిత్త , కఫాలు సమంగా ఉండాలి.

     మనం పిల్లల్ని ప్రొద్దున్నే నిద్ర లేపి హొంవర్కు చెయ్యండి. ట్యూషన్ కు వెళ్ళండి అని వారిని హింసించి మనం సాధించేది ఏమి ఉండదు. కనుక వారిని ప్రశాంతంగా 10 గంటలు నిద్ర పోయేందుకు సహకరించండి.

చిన్న పిల్లలు  0 -- 4 సం!! లలోవారు కనీసం 16 గంటలు నిద్ర పోవాలి.

4 --- 8 సం !! లలోవారు కనీసం 12 నుండి 14 గంటలు నిద్ర పోవాలి.

8 ---- 14 సం !! లలో వారు కనీసం 9 నుండి 10 గం!! లు నిద్ర పోవాలి.

     కనుక మీ ఇళ్ళలో 14 సంవత్సరాల వయసు వున్నవారు ఉంటే , వారు నిద్ర పోతుంటే ఆపకండి. ఎందుకంటే వారి శరీరం కఫ ప్రభావంతో నిండి ఉన్నది.

     కఫం అంటే జిగురు పదార్ధం ( స్నిగ్ధ పదార్ధం ) , చాలా బరువుగా ఉంటుంది. మనకు దగ్గు వచ్చినప్పుడు గొంతులో నుండి కళ్ళె వస్తుంది , అదే కఫం. కఫం బ్లెడ్ ప్రెజర్ ని  పెంచుతుంది. బ్లడ్ ప్రెజర్ ని తగ్గించు కోవాలంటే బాగా నిద్ర పోవాలి.

 పిల్లల్ని మనం నిద్ర పోనివ్వకపోతే వారు చిరాకుపడే వారిగా తయారవుతారు , కోపం పెరుగుతుంది. ఇక వారు తల్లిదండ్రుల మాట ఏదీ వినరు. ఎందుకంటే కఫం దోషపూరితమయి , పేరుకు పోయి వుంటుంది. దీనికి చక్కని మార్గం , వారిని వారి శరీరానికి అవసరమైనంత వరకు నిద్ర పోనివ్వండి. తర్వాత చూడండి ఎంత చక్కగా మీ మాట వింటారో.

     ప్రశాంతమైన నిద్ర , పిల్లలకైనా , పెద్దలకైనా ఖర్చు లేని మందు శరీరానికి కావలసిన నిద్ర

    " ఆరోగ్యమే ... మహాభాగ్యం."

              -- శ్రీ రాజీవ్ దీక్షిత్ ..... 🙏

Collected and typed by: Ram Prasad Gaaru



Loving-Serving-Saving Cow-Bull (Nature asset) is nothing wrong
Vishnu@Goseva world 

No comments: