Saturday, July 29, 2017

24.ఆకలి గురించి...GWR

🍊 మన ఆరోగ్యం ..... మన చేతుల్లో  ( 24 )

ఆకలి గురించి.....

      ఆకలి విషయంలో చాలా జాగ్రత్తగా వుండవలెను. ఆకలిని ఆపితే వచ్చే రోగాలు 103. ఇవి మొదట ఎసిడితో మొదలై చివరగా పేగు కేన్సర్ వరకు దారి తీస్తుంది. అందుకనే ఆకలిని బలవంతంగా ఎప్పుడూ ఆపకూడదు.

      ఉపవాసం శరీరాన్ని శుద్ధి చేస్తుంది. బాగా ఎక్కువగా తిన్నప్పుడు ఉపవాసం మంచిదే , లేదా వారానికి ఒకరోజు ఉపవాసం మంచిది. ఉపవాస సమయంలో ఖచ్చితంగా నీరు తాగుతూ ఉండాలి. ఎందుకంటే మీరు ఉపవాసం చేస్తున్నప్పుడు కూడా మీ కడుపులో ఆమ్లాలు రిలీజ్ అవుతాయి. దీనిని హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటారు. ఇది రిలీజ్ అయ్యేది మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చెయ్యటానికే మరి ఉపవాసం లో  ఆహారం తీసుకోము కాబట్టి నీరు తాగుతుంటే ( H.C.L.) హైడ్రోక్లోరిక్ యాసిడ్ నీటితో కలిసి మూత్రం ద్వారా బయటకు వస్తుంది. అప్పుడు మనకు ఎటువంటి హాని జరగదు , లేకుంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ పేగుల్ని  కాల్చివేస్తుంది. రోజూ మూడు పూట్ల భోజనం చేసేవారైతే వారానికి ఒకరోజు ఉపవాసం చెయ్యడం మంచిదే. పూర్తిగా శాఖాహారులైతే ఉపవాసం అంత మంచిది కాదు. మాంసాహారులకు మాత్రం ఉపవాసం తప్పని సరి. ఎందుకంటే మాంసాహారం తినేవారికి కడుపులో యాసిడ్స్ రిలీజ్ అవటం తగ్గిపోతాయి. దీని వల్ల వీరు దీర్ఘకాలం ఉపవాసం చెయ్యవచ్చు.

      దీర్ఘకాలంగా ఉపవాసం వుండేవారు నీటిలో నెయ్యిని వేసుకుని తాగుతూ ఉండవచ్చు , లవంగం నీరు త్రాగవచ్చు. ఇంకా కాచి చల్లార్చిన నీరు కూడా తీసుకోవచ్చును.

    "ఆరోగ్యమే.... మహాభాగ్యం "
......శ్రీ రాజీవ్ దీక్షిత్..... 🙏


Collected and typed by: Ram Prasad Gaaru



Loving-Serving-Saving Cow-Bull (Nature asset) is nothing wrong
Vishnu@Goseva world 

No comments: