దాహం గురించి ....
💧 మన ఆరోగ్యం.... మనచేతుల్లో (23 )
దాహం గురించి .....
దాహం వేసినప్పుడు తప్పకుండా నీరు త్రాగాలి. ఎంత తీవ్రమైన దాహం వేసినా నీరు గటగటా , వేగంగా త్రాగరాదు. కేవలం సిప్ సిప్ చేస్తూ , గుటక గటకగా మాత్రమే నీరు త్రాగాలి.
గటగటా వేగంగా నీరు త్రాగుట వలన హెర్నియా ( పేగుజారటం ), అపెండిసైటిస్ అనే రెండు రకాల వ్యాధులు వచ్చే అవకాశం వున్నది. అదే 60 ఏళ్ళ పైబడిన వారికైతే హైడ్రోసిల్ వ్యాధి రావచ్చు , ప్రొస్టేట్ సంబంధించిన వ్యాధి కూడా రావచ్చును.
నీటిని ఎప్పుడూ సిప్ సిప్ చేస్తూ త్రాగాలి. దాహం వేసినప్పుడు తప్ప కుండా నీరు త్రాగాలి. భోజనం చేసినప్పుడు దాహం వేస్తే మీరు మజ్జిగను త్రాగాలి.
ఇక దాహం వేయకుండానే
నీరు త్రాగవలసిన సమయం ఉదయం. నిద్ర
లేవగానే ఆ సమయంలో దాహం
వేయకపోయినా నీరు త్రాగవలెను.
నీరు త్రాగేటప్పుడు కూర్చుని మాత్రమే నీరు త్రాగాలి. ఆవుపాలు పితికేటప్పుడు కూర్చునట్లు గొంతుకు కూర్చుని లేక సుఖాసనంలో కూర్చుని గానీ నీరు తాగిలి. నిల్చొని కానీ , కుర్చీలో సగం కూర్చుని గానీ నీరు త్రాగటం మంచిదికాదు.
" ఆరోగ్యమే...మహాభాగ్యం "
No comments:
Post a Comment