Tuesday, June 6, 2017

GWR::ఊబ కాయం . ( Obesity )

*రాజీవ్ దీక్షిత్ స్వదేశి చికిత్స*

   *ఊబ కాయం . ( Obesity )*

# శరీరంలో అధిక క్రొవ్వు చేరడం వలన *ఊబ కాయం* వస్తుంది.

# మారు తున్న జీవన విధానం , ఆహారపు అలవాట్లు , కార్పోరేట్ కల్చర్ , వ్యాయామం చేయక పోవడం , సమతుల్య ఆహారం తీసుకోక పోవడం , శారీరక శ్రమ లేక పోవడం వలన త్వరగా *ఊబకాయం* వస్తుంది .

# ఊబకాయం వలన చాలా రోగాలు వస్తాయి .

# ఊబకాయం వచ్చిన తర్వాత శరీరం సుస్తిగా వుంటుంది . ఎక్కవగా పనులు చేసుకోలేక పోవడం , అలసి పోవడం .

# ఈ కారణాల వలన Diabetes , హృదయ రోగాలు , అజీర్ణం , మలబద్ధకం మొదలగు అనారోగ్య సమస్యలు వస్తాయి .

  కావున ఊబకాయం నుండి విముక్తి పొంద వలసిన అవసరం ఎంతో వుంది .

*గృహ చికిత్సలు : ---*

1. ప్రతి రోజు నియమంగా వ్యాయామము , యోగాసనాలు , ప్రాణాయమం చేయాలి .

2  1 గ్లాసు *వేడి నీళ్ళ* లో + *నిమ్మ రసం* + *సైంధవ లవణం* కలిపి త్రాగ వలెను .

3 . 1 గ్లాసు *వేడి నీళ్ళ*లో + 1 Spoon *తేనె* కలిపి త్రాగ వలెను .
 ( ప్రతి రోజు ప్రాతః కాలం పరగడపున త్రాగ వలెను )

4 . 10 గ్రాముల *సొంఠి* + *తేనె* కలిపి తీసుకొన వలెను .

5 . *తాజా తులసి ఆకులు*  + *తెనె* కలిపి తీసుకొన వలెను .

6  *ముల్లంగి ముక్కల*కు *తేనె* ను పూసి తినండి.
ప్రతి రోజు *ముల్లంగి ముక్కలు* + *నిమ్మ రసం‌*  + *సైంధవ లవణం* లను కలిపి తినండి . భోజనంలో మెంతి ఆకులను ఎక్కువగా వాడండి. తిన గలిగితే పచ్తి మెంతి ఆకూలను కూడా తినండి.

7 . *వరి బియ్యం* , *గోధుమ* లని భోజనంలో తక్కువగా తినండి . ఆకు కూరలు + పండ్లను + పండ్ల రసాలను , మజ్జిగను ఎక్కువగా తీసుకొండి .

8 . అధిక శ్రమ కలిగిన పనులు చేయండి .

   పై పద్దతులలో ఏదో ఒకటి ఆచరించి ఊబకాయంను తగ్గించు కొండి.

  *----- శ్రీ రాజీవ్ దీక్షిత్*

Collected and typed by: Ram Prasad Gaaru



Loving-Serving-Saving Cow-Bull (Nature asset) is nothing wrong
Vishnu@Goseva world 

No comments: