Tuesday, June 6, 2017

GWIMP:నరకం ఎక్కడో లేదు.......

🌼జైశ్రీమన్నారాయణ.......జై గోమాత🌼
నరకం ఎక్కడో లేదు........
మనకళ్లముందే ఉంది............అదెలాగంటరా...
దేవుని అనుగ్రహంతో నీతల్లి నీకు జన్మనిస్తుంది పెరిగి పెద్దవాడివి అయ్యాక పెళ్లి చేసుకొని ఒకరో ఇద్దరినో సంతానాన్ని కంటారు.ఆతరువాత అమ్మని నాన్నని వృద్ధాశ్రమంలో పెడతారు.హమ్మయ్య అనుకుంటారు......భగవంతుని లీలలు ఇప్పుడు ప్రారంభం అవుతాయి....అదెలాగ అంటారా...సంపాదించినసొమ్ము అనుభవించకుండా కమ్మని తియ్యని ఎంతో రుచికరమైన షుగర్ జబ్బు ప్రసాదిస్తాడు...ఇంకా ఉరుకులు పెట్టి కన్న పిల్లలకోసమని కమీషన్ల వ్యాపారం చేద్దామని అనుకునేలోపు బ్లడ్ ప్రెషర్ (BP ) ను బహుమతిగా ఇస్తాడు....ఇంతటి తో ఆగుతాడా మనిషి
(ఈకాలం మనిషి) ఒక పెద్ద ఫోన్ కొంటాడు
దాంట్లో జియో సిం వేస్తాడు....ఇకచూడండి ఆయన ప్రతాపం
సూక్తులు మీద సూక్తులు నిమిషానికి ఒకటి చొప్పున పెడుతూనే ఉంటాడు......
ఇవన్నీ మనకెందుకు అనుకుంటున్నారా...
ఇక్కడే ఉంది అసలు రహస్యం...........
దేవుడికి మండేది కూడా ఇక్కడే
సూక్తులు అయితే పెడతాడు...ఎందుకంటే
ఫ్రీ నెట్ కాబట్టి....
పిల్లికి బిచ్చమ్ పెట్టడు..... కనీసం ఒక పేద
విద్యార్థికి సాయం చేయడు.....గోమాతకు కట్ట గడ్డి కూడా పెట్టడు....ఇంకా సవాలక్ష కోరికలతో గుళ్ళు గోపురాలు తిరుగుతాడు......కానీ....గుడి బయట
అడుక్కునేవారికి నయాపైసా బిళ్ళ వేయడు....ఇవన్నీ భగవంతుడు పై నుండి
చూస్తూనే ఉంటాడు......అకస్మాత్తుగా ఆ ఇంట్లో ఒక విషాదాన్ని ఇస్తాడు దేవుడు(అది మనిషి రూపంలో కావచ్చు లేదా వ్యాపార పరమైనది కావచ్చు).......
ఇదే నరకం అంటే.....అందుకే నరకం ఎక్కడోలేదు ....ఇక్కడే ఉంది అంటారు పెద్దలు..............

స్వర్గం ఎక్కడో లేదు...ఇక్కడే వుంది......
అదెలాగో చూద్దాం.......
#జన్మ నిచ్చిన తల్లి తండ్రి ని ప్రేమతో వాత్సల్యంతో చూడటం....అప్పుడు ఆ ఇల్లు స్వర్గ సీమ....
#మీరనుభవించే  సుఖాలన్నీ అమ్మకు,నాన్నకు కూడా కల్పించటం.....
#అమ్మని నాన్నను పుణ్యక్షేత్రాలకు
తీసుకవెళ్లటం.....
#పిల్లలను క్రమశిక్షణతో పెంచటం.....
#పిల్లలకు చిన్నతనం నుండే మన సాంప్రదాయం గురించి ,మనదేవతల
మహిమలు గురించి తెలియచేస్తారో...
#పిల్లలకు చిన్నతనం నుండే ఇతరులకు
సహాయం చేయడం నేర్పడం...............
#తనకున్న దాంట్లో ఎంతోకొంత దానం ధర్మం చేస్తారో...
#ఆపదలో ఉన్న వారిని ,బంధువులను మిత్రులను కాపాడుతారో...... #ఈసమాజంలో ఉన్న అణగారిన వర్గాలకు
సేవ చేస్తారో.........
#ధర్మాన్ని రక్షించి ....ధర్మ ప్రచారం చేసి
గోశాలలు నిర్మించి గోమాతను కాపాడుతారో..........
#గోమాతలకు నిరంతరం ఎవరైతే సేవ చేస్తారో.........................
వారికి అదే స్వర్గం .....ఆఇల్లే స్వర్గ సీమ.....
ఆఇల్లే ,ఆ కుటుంబమే అందమైన బృందావనం...........అలాంటి ఇంట్లో
ఎప్పుడూ దేవతలు తిరుగుతూనే వుంటారు...................జై గోమాత🙏
గోశాలకు రండి......గోమాత సేవలో తరించండి......జై గోమాత....
🌼🌼🌼రాయల బసవేశ్వరరావు,విశాలాంధ్ర,రిపోర్టర్,ఖమ్మం.9848525003🌼🌼🌼🌼..జై గోమాత🙏

No comments: