Tuesday, June 6, 2017

GWIMP:మంచి సందేశం

ఆవులూ, ఎద్దులూ, కోడెలూ, దూడలు...
గుట్టల కొద్దీ మాంసం ముద్దలౌతుంటే...

వాటి ముద్దొచ్చే తలలు యంత్ర ఖడ్గాలకు బలవుతుంటే...
వాటి ఎర్రని రక్తం...
మనల్ని ముంచేసే మృత్యుసంద్రం అవుతుంటే...

వాటి పేగుల మాలలు... ఏడుపు కేకలు...
ఎముకల గుట్టలు... కొవ్వుల దిబ్బలు...
పాపం పెరిగినట్లు పెరుగుతుంటే...
#దేశం శాపం తగిలి ఒరుగుతుంటే...

నోరు తెరవని రాజకీయం...
నీతి చెప్పని భావదాస్యం...

మహాత్ముని ఆలోచనకు అవమానం కాదా...
గౌతమ బుద్ధుని బోధలకు గొడ్డలిపెట్టు కాదా...

ఆకలి తీర్చే గో మాతని... అవసరానికి చంపడం...
అన్యాయమే కాదు... దుర్మార్గం కూడా...

తన బిడ్డకు ఇవ్వాల్సిన స్థన్యాన్ని...
మనమూ తన బిడ్డలమే అని పంచే తల్లికి...

మనం ఈ మాత్రం రుణం తీర్చుకోలేమా...
మన ఆహారపు అలవాటు మార్చుకోలేమా

ప్రయత్నిద్దాం మిత్రమా...
పోయేదేముంది దేశానికి పట్టిన శాపం తప్ప...

No comments: