Friday, May 12, 2017

అమ్మాఆవూ ఉన్న

పాతరోజుల్లో ప్రతిఇంటా ఓ ఆవుకూడా ఉండేది..
అమ్మాఆవూ ఉన్న ఇళ్లెప్పుడూ సందడిసందడిగా ఉండేది.
పండుగల్లో వండే పిండివంటలకూ, తీపిపదార్థాలకూ ..
ఆవుకూడా ఉన్నందున
ఈగలు కూడా ఉండేవి.

అందుకే...
అమ్మా
ఆవూ
ఇల్లూ
ఈగ అన్నారు మనవాళ్ళు.

 ఇప్పుడు
అమ్మకు స్వతంత్రం లేదు
అమ్మకంటూ ఇల్లు లేదు
ఆవును పెంచుకునే ఓపిక,ఇష్టం లేవు
ఆ సందళ్ళులేవు,పిండివంటలూ లేవు ఇక ఈగలూ లేవు..

అమ్మ వృద్ధాశ్రమంలో
ఆవు గోశాలలో
ఇల్లు ఇక్కట్లలో
'ఈగో'లలో మనం ఉన్నాం

అప్పుడు ఆవు అమ్మవంటిది
ఇప్పుడు అమ్మ ఆవువంటిది

ఆవును చూడాలంటే గోశాలకు వెళ్ళాలి
అమ్మను చూడాలంటే వృద్ధాశ్రమ్ వెళ్ళాలి

ఆవుకు దండం పెట్టడం ముఖ్యంకాదు సంరక్షించడం గొప్ప
అమ్మ పోయినాక పిండం పెట్టడం ముఖ్యంకాదు ఆమె సంరక్షణలో మనం బాధ్యత పంచుకోవడం గొప్ప.

అందుకే ఇప్పుడు

అమ్మా
ఆవూ
ఇక్కట్లూ
'ఈగో'లు

No comments: