Monday, March 6, 2017

ఆయుర్వేదం ప్రకారం విరద్ధ ఆహార కలయిక virudda ahara kalayika

🌿 ఆయుర్వేదం ప్రకారం విరద్ధ ఆహార కలయిక. 🍂
*********************************


  ఏ పదార్ధాలనైతే కలిపి తీసుకుంటే రోగాలు ఉత్పన్నమవుతాయో వాటి యొక్క వివరణ.
  వ్యతిరేక ఆహారం అనేక రకాలుగా ఉంటుంది. ఉదాహరణలు:

🍼 పాలతో ---- పెరుగు , ఉప్పు , ముల్లంగి, పచ్చి సలాడ్, చింతపండు, పుచ్చకాయ ,కొబ్బరి, నిమ్మకాయ,సీతాఫలం,వగరు పండ్లు, దానిమ్మ,ఉసిరికాయ,దబ్బపండు,బీరకాయ,బెల్లం, మినుములు,రాజ్మ,చమురు,వివిధ రకాల పుల్లటి పండ్లు, చేపలు మొదలైన రకాలు ఆరోగ్యానికి మంచిదికాదు.
🍚 పెరుగుతో --- పాయసం( ఖీర్ ),పాలు,ఛీజ్,పన్నీరు,వేడి పదార్థాలు, దోసకాయలు,ఖీరా,కర్బూజాలు వ్యతిరేకమైనవి.
🍲 పాయసం(ఖీర్)తో---పనసకాయ,పుల్లటి పదార్ధాలు(పెరుగు,నిమ్మకాయ,మొ‌!!) సత్తు,మద్యం మొ!! హానికరం.
🍩 తేనెతో -- బెల్లడోనా,నెయ్యి ( సమాన నిష్పత్తిలో పాత నెయ్యి),వర్షపు నీరు,నూనె,కొవ్వు, ద్రాక్ష, తామరపువ్వు విత్తనాలు,ముల్లంగి,వేడినీరు,వేడిపాలు లేదా ఇతర వేడి పదార్ధాలు, చక్కెర, చక్కెరతో పాకంతో చేసిన షర్బత్ మొ!! హానికరం. తేనెను వేడిచేసి తీసుకోవడం నిషిద్ధం.
💧చల్లని నీటితో---- నెయ్యి, నూనె,వేడి పాలు లేదా వేడి పదార్ధాలు,పుచ్చకాయ,జామకాయ,దోసకాయ,వేరుశనగపప్పు మొ!! హానికరం.
🍲 వేడి నీరు లేదా వెచ్చని పానీయాలతో-- తేనె,ఐస్ క్రీమ్ లు,ఇతర చల్లటి పదార్థాలు తీసుకోరాదు.
🍜 నెయ్యి తో---సమాన నిష్పత్తిలో తేనె, చల్లని నీటితో తీసుకోవడం మంచిదికాదు.
🍉 కస్తూరి పుచ్చకాయ (కర్బూజా)తో --- వెల్లుల్లి, పెరుగు,పాలు, ముల్లంగి ఆకులు, నీరు మొ!! తీసుకోవడం హితకరం కాదు.
🍉 పుచ్చకాయ --- చల్లటి నీరు మరియి పుదీన తీసుకోవడం హితకరం కాదు.
బియ్యం తో--- వెనిగరు హానికరం.
మినప్పప్పుతో --- ముల్లంగి తినడం హానికరం.

అరటిపండుతో -- మజ్జిగను వాడడం హానికరం. 🍌

నెయ్యి -- కంచు పాత్రలో 10 రోజుల పాటు వరుసగా ఉంచితే విషపూరితమవుతుంది.

🍶 పాలు,మద్యం, కిచిడి -- ఈ మూడింటిని కలిపి భుజిస్తే ఆరోగ్యానికి హానికరం.

  వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని సరైన ఆహారం మాత్రమే తీసుకోవాలి.
  ' తినదగిన' ఆహారాన్నే తీసుకుంటూ ' తినకూడని' ఆహారానికి దూరంగా ఉండడమే మంచిది.
   " ఆరోగ్యమే మహాభాగ్యం " 💐


No comments: