Sunday, March 5, 2017

సున్నం ... ఒక మంచి మందు sunnamu manchi mandu

సున్నం ... ఒక మంచి మందు .
--------------------------------


             సున్నం ఔషధాల గని . సున్నుంలో కాల్షియము పరిపూర్ణంగా వుంది . సున్నంలో మన శరీరానికి కావలసిన సూక్ష్మపోషకాలు కలవు . సున్నం ( కాల్షియం ) 70 రకాల రోగాలకు మందుగా పని చేస్తుంది . వాటిలో కొన్ని రోగాలకు సున్నంని ఔషధంగా ఎలా వాడుకోవాలో తెలుసుకుందాము .

       పసిరికలు , సంతానోత్పత్తి మరియు నపుంసకత్వము సమస్యలకు ......

చెరుకు రసం +  సున్నుం .
(1 గ్లాసు )   +   ( 1 గ్రాము ).

     పై మూడు సమస్యలకు చెరుకు రసంలో సున్నం కలిపి త్రాగవలెను . ఉదయము పరగడుపున త్రాగవలెను .

   పసిరికలు కొద్ది రోజులలో తగ్గి పోవును . నపుంసకత్వము మరియు శుక్ర కణాల సమస్య వున్నవారు 1 లేక 1 1/2 సంవత్సరములు చెరుకు రసం సున్నంతో తీసుకొనవలెను . మంచి ఫలితము ఖచ్చితముగా ఉండును.

పిల్లలు ఎత్త పెరుగుటకు , జ్ణాపక శక్తి , స్మరణ శక్తి పెరుగుటకు ....

సున్నం +  పెరుగు లేక మజ్జిగ లేక   దాల్ ( పప్పు ) లేక నీళ్ళలో తీసుకొనవలెను .
 బుద్ది మాంద్యం వున్న పిల్లలకు కూడా వాడ వచ్చును .

మోకాళ్ళ నొప్పులు , భుజాల నొప్పులు , వెన్న పూస నొప్పులు , పంటి నొప్పులు , పళ్ళు పుచ్చి పోయిన , నోటిలో బొబ్బలు , స్పాండిలైటిస్ ( Spondylitis ) పై సమస్యలు వున్నవారు .

       సున్నం  +  నీళ్ళు
   ( 1 గ్రాము ) + ( 1 గ్లాస్ ).

      ఉదయం పరగడపున తీసుకొనవలెను .

రక్త వృద్ది కొరకు , అనీమియ (Anemia )  వున్న వారు .....

   సున్నం + దానిమ్మ పండ్ల రసం లేక ఆరంజ్ రసం లేక చెరుకు రసంతో ఉదయము పరగడుపున తీసుకొనవలెను . ( దానిమ్మ పండ్ల రసం ఉత్తమము ).
 స్త్రీలలో ఋతుక్రమ సమస్యలు , మెనోపాజ్ ( Menopause ) తో సమస్యలు కలవారు ...

 సున్నం +  పెరుగు లేక నీళ్ళు లేక పప్పు (Daal) తో తీసుకొనవలెను .

గర్భిణి స్త్రీలకు ......

 దానిమ్మ పండ్ల రసం. + సున్నం .
 ( ఒక కప్పు )   +            ( 1 గ్రాము  లేక ఒక గోధుమ గింజ మోతాదు )

        గర్భిణి స్త్రీలు దానిమ్మ పండ్ల రసం సున్నంతో 9 నెలల వరకు తీసుకొనవలెను. గర్భధారణ సమయములో పిండం యొక్క అభివృద్ధి కొరకు అత్యంత ముఖ్యమైనది కాల్షియం . పై విధంగా తీసుకొనిన యెడల మంచి ఫలితము వుండును.

ఫలితములు.....

తల్లికి ప్రసవసమయములో ఎటువంటి ఇబ్బంది కలుగదు . సుఖమైన , సహజమైన ( NORMAL ) ప్రసవం జరుగుతుంది .

పుట్టిన పిల్లలు బలంగా , ఆరోగ్యంగా ఉంటారు .

పిల్లలు పెరుగుతున్న కొద్ది వారిలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది . అద్భతమైన రోగ నిరోగ శక్తి వుండుట వలన త్వరగా గంభీరమైన రోగాల బారిన పడరు .

పిల్లలు చాలా తెలివి తేటలు కలిగి వుంటారు . వీరి  I. Q . స్ధాయి ఎక్కవగా వుండును .

తాంబూలం ......

ప్రాచీన కాలం నుండి భారతీయులకు తాంబూలం వేసుకొనే అచారం కలదు .

తాంబూలంలో వేసుకోవలసిన పదార్ధాలు ......

🌿 తమలపాకులు ముదురు ఆకుపచ్చ రంగులో వుండి వగరు రుచి కలిగి వుండాలి .
  సున్నుం ( 1 గ్రామ్ లోపే ) , సొంటి , యాలకుకాయ , లవంగం , సోంపు , కుంకుమ పువ్వు , దాల్చిన చెక్క , గులకంద్ ( గులాబి పూల రేకులతో చేసినది ), వాము ( 2 లేక 3 ) గింజలు .

తాంబూలంలో వేసుకోకూడని పదార్ధాలు . .....

వక్కపొడి , కాచు , పొగాకు .

ముఖ్య గమనిక : -

సున్నుం  1 గ్రామ్ ( ఒక గోధుమ గింజ మోతాదు ), పండ్ల రసాలు లేక నీళ్ళు 1 కప్పు మాత్రమే తీసుకొనవలెను .

సున్నుంని ఎక్కవ మోతాదులో తీసుకొన కూడదు .

సున్నంని ద్రవ్య పదార్ధాలతోనే తీసుకొనవలెను .

శరీరంలో ఏ భాగములోనైన రాళ్ళు వున్న వారు ఎట్టి పరిస్ధితులలో సున్నుంని తీసుకొనరాదు .

---- శ్రీ రాజీవ్ దీక్షిత్ .

No comments: