Tuesday, March 14, 2017

గోమాత… సకల ఆరోగ్య ప్రదాయిని Gomata-sakala aarogya pradayani

గోమాత’ … సకల ఆరోగ్య ప్రదాయిని
------------------------------------

గోవుకు సంబంధించిన పాలు, పెరుగు, నెయ్యి, గోమూత్రం, గోమయం, గోరోచనం అనే ఆరింటిని ‘గోషడంగాలు’ అంటారు. వీటిలో మొదటి మూడింటినీ ‘పంచగవ్యాలని’ అంటారు. తిరిగి వాటిలో మొదటి మూడింటిని పంచామృతాలలో వినియోగిస్తారు. మొత్తం మీద గోవుకు సంబంధించిన ఈ ఆరు పదార్ధాలు వైద్య చికిత్సలలో ఎంతో ఉపయోగకరాలని ఆయుర్వేద గ్రంథాలవల్ల తెలుస్తుంది.

‘ఉత్సాహం దీపనం బల్యం మధురం వాతనాశనమ్.. అల్పాభిష్యంది గోక్షీరం స్నిగ్థం గురు రసాయనం’ అంటారు ప్రాచీన వైద్య శాస్త్ర నిపుణులు శుశ్రుతుడు. ఆవుపాలు ఎన్ని విధాల శక్తికలవో, ఎన్ని రోగాలను పోగొట్టగలవో విశేషంగా వివరించారు.

ఆవుపాలు సంపూర్ణ ఆహారమని, వాటిలో పోషక విలువలు ఎన్నో ఉన్నాయని ప్రొఫెసర్ యన్.యన్.గాడ్ బోలే వివరించారు.కేసిన్ అనే పదార్ధం ఉండడం వల్ల ఆవుపాలు మధుమేహాన్ని నియంత్రించగలవని, వ్యాధి రాకుండా చూడగలవని ఆయుర్వేదాచార్యులు డా.మిథిలేశ్ బడేరియా చెప్పారు. తల్లిపాల తర్వాత శిశుపోషణలో అత్యంత సమర్ధమైనవి ఆవుపాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.

గుండె జబ్బులను పోగొట్టే శక్తి ఆవుపాలకు ఉందని అంతర్జాతీయ హృద్రోగ నిపుణులు డా.శాంతిలాల్ షా తెలిపారు. ఆవుపాలు తాగే బాలబాలికలలో జ్ఞానశక్తి, మేధస్సు పెరిగి, వారు ప్రతిభావంతులు కాగలరని పూనా వ్యవసాయ కళాశాల అధ్యాపకులు జె.యల్. సహస్రబుద్ధే చెప్పారు. ఇలా ఆవుపాలకు గల గుణాలు అనంతాలని పరిశోధకుల ద్వారా స్పష్టమవుతోంది.

స్నిగ్థం విపాకే మధురం – దీపనం బలవర్థనం ‘ అంటూ శుశ్రుతుడు ఆవు పెరుగులో జఠరాగ్నిని, బలాన్ని పెంపొందించే గుణం ఉందని, పేగుల పూత, వాతం, పార్శ్వపు నొప్పి, మానసిక దోషాలు పోగొట్టగలదని చెప్పారు. చలిజ్వరం, పైల్స్, రక్తస్రావం, రక్తహీనత, నరాల బలహీనతలను పోగొట్టే శక్తి ఆవు పెరుగుకి ఉంది.
ఆవు నెయ్యి విశేషంగా నేత్రాలకు ఉపయోగకరమైనది. త్రిదోషహరమైనది. ఆయుర్ధాయాన్ని పెంచగల గొప్ప రసాయనం ఆవునెయ్యి. అనేక ఆయుర్వేద ఔషధాలలో, విశేషించి హింగ్వాదిఘృతం, పంచకోలాది ఘృతం వంటి వాటిలో వినియోగిస్తారు.
గోమూత్రం చికిత్సకు వినియోగించే అష్టమూత్రాలలో గోమూత్రం సర్వశ్రేష్ఠం. ఇది మూత్రపిండ వ్యాధులు, కుష్ఠు, బొల్లి, దగ్గు, గజ్జి, పైల్సు, పాండు, పచ్చకామెర్లు, శ్వాసవ్యాధులు, కర్ణశూల, ముఖ, ఉదర వ్యాధులు ఎన్నింటినో పోగొట్టగలదు.

 శుద్ధి చేసిన గోమూత్రాన్ని నేడు చాలామంది ఔషధంగా స్వీకరిస్తూ, ఆరోగ్య ప్రయోజనాలను పొందుతున్నారు. ఆవుదూడ మూత్రం క్షయరోగానికి చికిత్స. గోమూత్ర ఫలితాలు అనంతాలు.
గోమయం ఇది క్రిమి సంహారకం.

గోరు వెచ్చని నీటిలో గోమయం వేసి, స్నానం చేస్తూ ఉంటే చర్మవ్యాధులు పోతాయి. ఆస్తమా, దగ్గు, ఎక్కిళ్లు, నేత్రరోగాలు, వాతరోగాలు, ముఖరోగాలకు గోమయంతో చికిత్స ఉంది. గోమయం బహుప్రయోజనకారి.

గర్భస్రావ రోగాలకు, రక్తరోగాలకు గోరోచనం ఉపయుక్తమైనది. విషం, ఉన్మాదం, గ్రహదోషాల వంటివి పోగొట్టగలది. మంగళకరమైనది. షడంగాలతో అనేక ఔషధాలు తయారవుతున్నాయి. అసాధారణ ప్రయోజనాలు కలిగిన గోషడంగాలను వినియోగించుకుంటూ ప్రజలు ఐహిక, పారమార్థిక ప్రయోజనాలను సాధించుకోవాలని మహర్షుల ఆశయం.

సేకరణ :visweswararao gaaru@Goseva world

No comments: