భారతీయులు ‘రాజీవ్ దీక్షిత్’ త్యాగాలు మర్చిపోలేరు
----------------------------------------------------------------
రాజీవ్ దీక్షిత్.. దేశభక్తుడు, ప్రముఖ భారతీయ సామాజిక కార్యకర్త, గొప్ప వక్త, ఆధ్యాత్మక వేత్త. 1967, నవంబర్ 30 న అలహాబాద్ లో ఆయన జన్మించారు. స్వదేశీ ఉద్యమంపై చివరి వరకు పోరాడారాయన.
మాతృభూమి కోసం ఎన్నో త్యాగాలు చేశారు రాజీవ్ దీక్షిత్. ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోయారు. జనవరి 8, 1992 నుంచి ‘ఆజాదీ బచావో ఆందోళన’ కు సహవ్యవస్థాపకుడిగా ఉండి పనిచేశారు. ఆయుర్వేదశాస్త్రంలో ఉన్న గొప్ప విషయాలను ప్రజలకు చేరవేసేందుకు కృషి చేశారు. ఎన్నో దేశభక్తి గీతాలను రచించారు.
మా చరిత్ర, అర్ధశాస్త్రం, రాజకీయం, న్యాయశాస్త్రంలో ఆయనకు మంచి పట్టు ఉంది. స్విస్ బ్యాంకులో ఉన్న నల్లధనాన్ని తిరిగి భారత్ కు రప్పించాలనే విషయంలో ఆయన ఎంతో కృషి చేశారు. భారతదేశం పేద దేశం కాదని.. అవినీతిపరులైన రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల వల్ల భారతదేశ ధన సంపద విదేశాలకు తరలిపోయిందని ఆయన అభిప్రాయపడేవారు.
విదేశీ వస్తువులను బహిష్కరించాలని మన దేశంలో ఉత్పత్తి అయిన వాటినే వాడాలని చెబుతుండేవారు. ఆ దిశగా ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు పాటుపడేవారు. నవంబర్ 30, 2010లో ఆయన పుట్టినరోజునాడే రాజీవ్ దీక్షిత్ హార్ట్ ఎటాక్ తో చనిపోయారు. ఆయన మరణంపై ఎన్నో అనుమానాలున్నాయి. చనిపోయిన తరువాత ఆయన దేహం నీలం, నలుపు రంగులోకి మారిపోవడం అనుమానాలకు తావిచ్చింది. అయితే ఎటువంటి పోస్టుమార్టం జరపకుండానే ఆయనకు దహన సంస్కారాలు నిర్వహించారు. ఆయన మరణంపై మీడియా సైతం స్తబ్ధత పాటించింది.
By bharat today| Publish Date: Nov 30 2015 9:23AM |

No comments:
Post a Comment