✍✍✍✍✍✍✍
A cute story
అతి శీతల గిడ్డంగిలో పని చేస్తున్న ఓ వ్యక్తి కథ!
ఆ రోజు పొద్దుపోయి... చీకట్లు ముసురువేళ.. ఎవరికి వాళ్లు పని ముగించికొని ఇళ్లకు వెళ్లే హడావిడిలో ఉన్నారు!
అతను మాత్రం సమయం చూడకుండా ఆ శీతల యంత్రంలో వచ్చిన సాంకేతిక సమస్యను సరిజేస్తూ లోపలే ఉండిపోయాడు!
దినచర్యలో భాగంగా మిగిలిన సిబ్బంది డోర్ లాక్ చేసి లైట్స్ ఆఫ్ చేసేసారు!
గాలి చొరబడని శీతలగిడ్డంగిలో తాను అనుకోకుండా బంధీనైనాని గ్రహించాడు!
గంటలు గడుస్తున్నాయి! బయటపడే మార్గం లేక తానిక ఐస్ గడ్డల్లో సజీవ సమాధి కాబోతున్నాననుకుంటున్న సమయంలో....
.......
....
ఎవరో డోర్ ఓపెన్ చేసిన అలికిడి...
ఆశ్చర్యం...
టార్చ్ లైట్ తో సెక్యూరిటీ గార్డ్ వచ్చి తనను రక్షించాడు!
బయటకు వచ్చేటపుడు ఈ అధ్భుత ఘటన నుండి తేరుకుంటూనే
"నేను లోపలే ఉన్నానని నీకు ఎలా తెలుసు? నీకు సమాచారం ఎవరిచ్ఛారు?"
అడిగాడు గార్డ్ ని!
"ఎవ్వరూ చెప్పలేదు సార్!
ఈ సంస్థలో 50 మందికి పైనే పని చేస్తున్నారు... కానీ ప్రతిరోజూ విధి నిర్వహణకు వస్తూ ఉదయం 'హలో' అని.. సాయింత్రం ఇంటికి వెళ్తూ 'బై' అని చెప్పి పలకరించేది మీరొక్కరే సర్!
ఈరోజు ఉదయం 'హలో' అని పలకరించిన మీరు.. సాయింత్రం 'బై' చెప్పలేదు.. దాంతో నాకు అనుమానం వచ్చి తనిఖీకి వచ్చాను అంతే సార్!"
అతనూహించలేదు..
అతనికి ముందుగా తెలియదు! భేషజం గాని బాస్'ఇజం' గాని లేకుండా ప్రతిరోజూ ఇలా తాను చేసే ఒక చిన్న పలకరింపుపూర్వక "సంజ్ఞ" కారణంగా తన ప్రాణాలు కాపాడబడ్తాయి అని!
మనకు తెలియకపోవచ్చు అటువంటి అధ్భుతాలు మన జీవితంలోనూ తారసపడవచ్చని!
నిజ జీవితంలో పరస్పరం ఉపయోగించే భావజాలం, ప్రవర్తన, చర్యలను బట్టే ఎదుటి వారి వైఖరి ఉంటుంది! అందుకు ఎవరికీ ఏ విద్యార్హతలు ప్రామాణికం కాదు!
గొప్పవారి గొప్పతనం చిన్న వారితో ప్రవర్తించే తీరులో ఉంటుంది.వారి ప్రాణాన్ని చిన్న వారిచే గొప్ప మనస్సు చేత కాపాడబడుతుంది.
ఈ రోజుల్లో చాలమంది be positive అని అందరికీ చెప్పేస్తు ఉంటారు.కానీ ఇతరుల ను ముందు తప్పు గా అర్దం చేసుకొని అడిగితే వారి పై ఎదురు దాడి చేస్తూ వారి వాదనను సమర్దించుకుoటారు.
అదే వారూ ఇతరుల కు చెప్పే be positive వారిలో ఉంటే అర్దం చేసుకుంటే సమస్యలు ఉండక పోవచ్చు!
సలహాలు మాత్రమే కాదు సంప్రదిoపు లు మంచి వై ఉండాలి.
చాలామంది దీనిని ఫార్వర్డ్ చేశారు, చేస్తున్నారు, చేస్తారు కూడా!
కానీ ఎంత మంది పాటిస్తున్నారు? ఎంతసేపూ ఎదుటివారే పలుకరించాలనే అహమే ఎక్కువగా కనిపిస్తుంది.
నిజంగా ఈ పోస్ట్ లోలాగా పలుకరించేవారుంటే వారందరికీ నమస్కారం!
నిజంగా "అహం" లేకుండా పాటిస్తూ ఫార్వర్డ్ చేసేవారికి శతాధిక నమస్సులు!
👏🏻👏🏻👏🏻
cow for all
No comments:
Post a Comment