Friday, August 18, 2017

ఆత్మబంధువు డా :: రాజీవ్ దీక్షిత్ గారికి నమఃస్కరిస్తూ* Gwhm6

*శ్రీ రాజీవ్ దీక్షిత్*

*ఆత్మబంధువు డా :: రాజీవ్ దీక్షిత్ గారికి నమఃస్కరిస్తూ* ..
సజ్జనులైన సోదర సోదరీమణులకు నమస్కారం.

# మనకు మన శరీరం గురించి తెలియని ఎన్నో రహస్యాలను మన ఋషులు అనేక విధాలుగా అందించారు.
# *రాజీవ్ దీక్షిత్* గారు శ్రీ వాగ్భటాచార్యులు వ్రాసిన *అష్టాంగ హృదయం , అష్టాంగ సంగ్రహము* ల గురించి తెలియ జేసినారు .
# *మహర్షి వాగ్బటాచార్యుల* వారు ఏమాత్రం ఖర్చులేని , ఎంతో సులువైన , అత్యంత ప్రయోజనకరమైన ఎన్నో విలువైన సందేశాలను అందించారు .
# శ్రీ రాజీవ్ దీక్షిత్ గారు వాగ్భటాచార్యుల వారి సందేశాలపై  కొన్ని సంవత్సరాలపాటు ఆధునిక విజ్ఞాన శాస్త్ర దృక్కోణంలో ఎంతో లోత్తెన పరిశోధన చేసి మనకు అత్యంత సులభంగా , సరళంగా అర్ధమయ్యే విధంగా తెలియ జేసినారు .
# డాక్టర్ రాజీవ్ దీక్షిత్ గారు ఎన్నో సంవత్సరాల పాటు దేశం నలుమూలలా తిరిగి భారతీయతను , ఆరోగ్యం , శరీరం గురించి చెప్పినారు .

# ఆరోగ్యాభిలాషులందరికీ *ఏమి తినాలి , ఎందుకు తినాలి , ఎలా తినాలి , ఎప్పుడు తినాలి* అనే విషయాలమీద ఉండే సందేహాలన్నింటికీ చక్కటి సమాధనము *రాజీవ్ దీక్షిత్ గారి ఆరోగ్య సూత్రాలు* .
# ఆయుర్వేదంలో మన ఆరోగ్యం కోసం 85% మనమే చాలా నియమాల్ని సహజంగా , సరళంగా పాటించి ఆరోగ్యాన్ని పొందవచ్చు . మిగిలిన 15% మాత్రమే ఆరంగంలో ప్రత్యేక ప్రవేశమున్న వారి సహాయం పొందవచ్చు . ఏప్పుడో గాని ఆ అవసరము రాదు .
# జీవితాన్ని రోగమయంగా చేసుకొని పూర్ణాయుష్షును అల్పాయుష్షుగా చేసుకుంటున్నాము .
# లోకంలో అందరికీ వచ్చే జబ్బులలో అత్యధిక శాతము తెలిసో తెలియకో చేతులారా తెచ్చుకునేవే .
# ఆహార వ్యవహారాలలో కొద్దిపాటి చిన్న , చిన్న మార్పులు చేసుకోగలిగితే మనం నిండు నూరేళ్ళు పరిపూర్ణ ఆరోగ్యంతో జీవించగలం .
# ఏ వైద్యుని , ఎటువంటి ఔషధములూ లేకుండా నియమిత ఆహారము , నియమ బద్దమైన దినచర్యతోటి వాగ్బటాచార్యులు అందించిన *"అమూల్యమైన ఆరోగ్య సూత్రాల"* ను అర్ధం చేసుకుని పాటిస్తే మనం పరిపూర్ణంగా , ఆరోగ్యంగా , పూర్ణాయుష్షుతో జీవించగలం.
# ఈ అమూల్య సూత్రాలని మనం తెలుసుకుని , మన తోటి వారికి తెలియ జేయవలసిన అవసరం ఎంతో వుంది .
# భావితరాల వారికి ,మన పిల్లలకి మనం అందించవలసిన తరతరాల వారస్వత సంపద , అమూల్య రత్న భాండాగారమే ఈ *"ఆరోగ్య సూత్రాలు"* .

*గమనిక :-  గ్రూపు సభ్యులందరు ఆచరించ గలరు*

*ఇట్లు*
*మీ*
*రామ ప్రసాద్ . పి*
*# 98858 90177*

No comments: