Friday, August 18, 2017

*సూర్యోయం నుండి సూర్యాస్తమయం వరకు సనాత దిన చర్య*Gwhm4

*సూర్యోయం నుండి సూర్యాస్తమయం వరకు సనాత దిన చర్య*

1. ప్రాతః కాలములో నిద్ర నుండి లేచిన తర్వాత , ముఖః ప్రక్షాళనమునకు మునుపే 2 లేక 3 గ్లాసుల వేడి నీటిని త్రాగ వలెను .

2 .కాలకృత్యాలు , స్నానం ముగించిన తర్వాత ఆత్మ శుద్ది కొరకు యోగాసనాలు మరియు ప్రాణాయమములు చేయ వలెను .

3 .నిద్ర లేచిన ఒక గంట తర్వాత పండ్ల రసాలు త్రాగ వలెను.

4. ఉదయం  భోజనము 7 నుండి 9 లలోపే తీసుకొన వలెను. ఉదయ భోజనములో ... పండ్లు , రొట్టెలు , ముడి బియ్యం , ఆకు కూరలు , పప్పు , బెల్లం మొదలగు నవి తిన వలెను . శరీరంలో జఠరాగ్ని సూర్యోదయము వరకు తీవ్రముగా వుండును .
( ఉదయం 7 గంటల నుండి 9.30 గంటల వరకు వుండును )

5. మధ్యాహ్న భోజనము 1 గంట నుండి 2 గంటలలోపే తీసుకొన వలెను. భోజనము తర్వాత మజ్జిగ లేక పండ్ల రసాలను ఖచ్చితంగా తీసుకొన వలెను .
సాయంత్ర భోజనము 5 గంటల నుండి 6 గంటలలోపే భోజనము చేయ వలెను .

6. ఉదయము సంతృప్తిగ భోజనము చేయ వలెను.
మధ్యాహ్న భోజనము ఉదయము తీసుకున్న ఆహార పరిమాణములో సగ భాగము తీసుకొనవలెను.
సాయంకాల భోజనము మధ్యాహ్న భోజన ప‌రిమాణం లోని సగ భాగం మాత్రమే తీసుకొన వలెను.

7 . ఎల్లప్పుడూ సఖాసనమలో కుర్చొని భోజనము చేయ వలెను .

8 .సూర్యాస్తమమునకు 40 నిమిషాలలోపే భోజనము చేయ వలెను. రాత్రి ఆవు పాలు త్రాగ వలెను .

9. భోజనము చేసిన వెంటనే నీళ్ళు త్రాగిన *విషం*తో సమానము .
భోజనమునకు 48 నిమిషాల లోపే నీళ్ళు త్రాగ వలెను.
భోజనమీ తర్వాత 1 1/2 గంట లేక 2 గంట‌ల  తర్వాత నీళ్ళు త్రాగ వలెను.
భోజనము మధ్యలో  లేక భోజనము తర్వాత గొంతు శుద్ది కొరకు 1 లేక 2 గుటకల నీళ్ళు త్రాగవలెను .
నీళ్ళు ఎప్పుడు త్రాగిన గుటక , గుటక గా త్రాగ వలెను .

10. భోజనము తర్వాత 10 నిమిషాలు *వజ్రాసనము* వేయ వలెను .

11. ఉదయం మరియు మధ్యాహ్న భోజనము తర్వాత కనీసం 20 నిమిషాలు ఎడమ వైపున తిరిగి పడుకొన వలెను .

12 . సాయంకాల భోజనము తర్వాత 500 లేక 1000 అడుగులు నడవ వలెను .

13 . సాయంకాల భోజనము తర్వాత 2 లేక 2.30 గంటల తర్వాత పడుకొన వలెను.

ఆచరించి , ఆరోగ్యాన్ని పొందండి.

     *శ్రీ రాజీవ్ దీక్షిత్*

--- రామ ప్రసాద్. పి

No comments: