Saturday, June 10, 2017

రాజీవ్ దీక్షిత్ గురించి

*రాజీవ్ దీక్షిత్*

*జననం*..

 రాజీవ్ దీక్షిత్ 1967 నవంబర్ 30వ తేదీన ఉత్తర ప్రదేశ్ లోని నాహ్ అనే గ్రామంలో జన్మించారు . తండ్రి రాధేశ్యామ్ దీక్షిత్, తల్లి మిధిలేష్ కుమారి . వారి సంవరక్షణలో పదకొండన తరగతి వరకు పూర్తి చేశారు రాజీవ్ దీక్షిత్.

*ఉజ్వల జీవితం* ..

ఉన్నత విద్య కోసం 1994 లో అలహాబాద్ ( ప్రయాగ ) లోని ఐ.ఐ.టి ఇన్ స్టిట్యూట్ లో బి.టెకఱ చదివారు . తరువాత కాన్పూరు ఐ.ఐ.టి లో శాటిలైట్ కమ్యూనికేషన్ లో యం.టెక్ చేశారు . తరువాత ఫ్రాన్స్ లో టెలికమ్యూనికేషన్ లో పి.హెచ్.డి చేశారు . తరువాత ఒకప్పటి భారతీయ రాష్ట్రపతి అయిన ఎ.పి.జె. అబ్దుల్కలామ్ తో కలిసి సి.ఎస్.ఐ.ఆర్.లో శాస్త్రవేత్తగా కలిసి పని చేశారు .

*భరతమాత సేవలో* ..

  అంతే కాక రాజీవ్ దీక్షిత్ శాస్త్రవేత్తగా య.ఎస్.ఎ.లో , యు.కె , లో తన జీవితం ఎంతో సుఖంగా జీవిస్తున్నప్పటికీ , భారత దేశంలో మల్టీనేషనల్ కంపెనీలు చేస్తున్న దోపిడీల గురించీ , నల్లధనం గురించి , ఇంకా భారత దేశంలోని *ఆయుర్వేధ వైద్యం* లోని గొప్ప తనాన్ని తెలియజేయటానికి , భారతీయ ప్రజలను  చైతన్య పరచటానికి  సామాన్య భారతీయునిగా  భరతమాత సేవకుడిగా జీవించారు .

1998 లో స్విస్ బ్యాంక్ లోని నల్లధనాన్ని గురించి తెలుసుకుని 2002 నుండి దాని గురించి ప్రజలకు తన ఉపన్యాసాల ద్వారా తెలియ జేశారు . భారతీయుల నల్ల ధనాన్ని జాతీయ సంపదగా గుర్తించాలని సుప్రీంకోర్టుకు విన్నవించు కున్నారు .

*పోరాటం*..
  ఇంకా పెప్సీ , కోకో కోలాల్లో పురుగుల మందులున్నాయని , వాటిని టాయ్ లెట్ క్లీనర్స్ గా ఉపయాగించ వచ్చన్ని చెప్పారు . వాటికి వ్యతిరేకంగా  1998 లో  *ఆజాదీ బచావో ఆందోళన్* ఉద్యమాన్ని నడిపించారు . సెంట్రల్ లేబరేటరీ సైంటిస్ట్ డా : సునీతా నారాయణ్ కూడా పెప్సీ , కోకో కోలాల్లో పురుగు మందులున్న మాట నిజమని నిర్దారించారు . భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికి మన రూపాయి విలువ 1 డాలరుతో సమానంగా ఉండేది . అలాగే 1 రూపాయి బ్రిటన్ పౌండ్ కి సమానంగా ఉండేది . ఇంకా ఫ్రాంక్, దస్మా కూడా మన రూపాయికి సమానంగా ఉండేవనే విషయాన్ని తెలియ జేశారు రాజీవ్ దీక్షిత్ .

*చిన్న పిల్లలే ఎందుకు ?*..

   అమెరికాలో కోల్గేట్ బాక్స్ మీద  14 సంవత్సరాల లోపు పిల్లలకు అందుబాటులో ఉంచకండి , అని ఉంటుంది . కానీ వాటి ప్రచారం కోసం మాత్రం చిన్న పిల్లల్ని ఎందుకు ఉపయోగిస్తున్నారని ప్రశ్నించారు రాజీవ్ దీక్షిత్ .

  రాజీవ్ దీక్షిత్ డాక్టరేట్ , సైంటిస్ట్ అయినప్పటికీ వారు పేరుకు ముందు గానీ ఎప్పుడూ వాటిని వాడుకునే వారు కాదు .
 
  అంతేకాక 09 - 01 - 2009 న *భారత్ స్వాభివాన్* అనే ఉద్యమాన్ని నడిపించారు రాజీవ్ దీక్షిత్ . 30 - 1 - 2010 న *భారత స్వాభిమాన్* ప్రచార యాత్రలో భాగంగా చత్తీస్ ఘడ్ లోని బిలాయ్ గ్రామములో ఆకస్మికంగా మరణించారు . అయితే మరణించిన కొద్ది సేపటికి ఆయన శరీరం నలుపు , బ్లూ రంగులో మారడం వలన ఆది బహశా విష ప్రయోగం జరిగి ఉండవచ్చని తెలుస్తుంది .

 దీనికి కారణం ఖచ్చితంగా లంచగొండి రాజకీయ నాయకులు , ఇంకా మల్టీ నేషనల్ కంపెనీల వారు అయి ఉండవచ్చు . ఎందుకంటే ఇంత గొప్ప వ్యక్తి అకస్మాత్తుగా చనిపోతే , కనీసం వారి శరీరాన్ని పోష్ట్ మార్టం కూడా చేయ లేదు . అంతేకాక ఈ విషయాన్ని ఏ మీడియా కూడా ప్రచారం చేయలేదు .

  రాజీవ్ దీక్షిత్ లాంటి మహానుభావుని గురించి ఏ మీడియా గానీ , ఎవరూ ప్రపంచానికి తెలియ పరుచక పోవచ్చు . బాధ్యత గలిగిన ప్రతి భారతీయుడు ఈ మహా పురుషుని  గురించి ప్రచారం చేస్తాడు.

*వందే మాతరం .... జై హింద్*.

  స్వామి వివేకానంద భారత దేశానికి ఎలా నూతన శక్తిని ఇచ్చారో , అదే విధంగా తన ప్రసంగాల ద్వార కొత్తతరం భారతీయులలో దేశ భక్తిని నింపి , నూతన శక్తిని , ప్రేరణను ఇచ్చి , బానిస విద్యా వ్యవస్ద వలన భారతీయులలో ఏర్పడిన ఆత్మన్యూనతను భావదాస్యాన్ని ప్రారదోలడానికి ఎంతో కృషి చేశారు రాజీవ్ దీక్షిత్.

  స్వదేశీ చికిత్స పేరుతో వాగ్భటుడు మొదలైన మహర్షులు వ్రాసిన ఆయుర్వేధ రహస్యాలను సామాన్య జన బాహుళ్యంలో ప్రచారం చేసి , అల్లోపతిలో లక్షలు పోసినా నయం కాని అనేక వ్యాధులకు సులవైన , సరసమైన పరిష్కారాలను చెప్పిన మహామహుడు రాజీవ్ దీక్షిత్ . రోగాలను నయం చేసుకోవడమే కాదు , రోగాలు రాకుండా సుఖంగా ఎలా జీవించాలో కూడా చెప్పారు .

   ఉన్నతమైన విద్య  నభ్యసించినా , దేశం ఎదుర్కొంటున్న సవాళ్ళను చూసి , తన జీవితం కంటే దేశభవిష్యత్తు ముఖ్యమని , తన జీవితాన్నే పణంగా పెట్టి , స్వదేశి ఉద్యమం నడిపారు రాజీవ్ దీక్షిత్ . భారతీయులకు తెలియకుండా దాచి పెట్టిన అనేక విషయాలను బట్ట బయలు చేశారు .

   మనలో ఎప్పుడైనా ఆత్మన్యూనత కలిగినా , భారతీయులు ఇతర దేశీయుల కంటే తక్కువ అనిపించినా , రాజీవ్ దీక్షిత్ గారి ప్రసంగాలను వింటే , ఇక వారు ఎప్పటికి ఆత్మన్యూనతకు లోనవ్వరు . ఆధునిక భారతావనిలో నిజమైన దేశభక్తుడు రాజీవ్ దీక్షిత్ . వారి వలన అనేక మంది భారతీయులు స్పూర్తిని పొందారు .

*జన్మదినం నాడే మరణం*..

   వారు జన్మించింది 30 నవంబరు అయితే , మరణించింది కూడా 30 నవంబరు కావడం విచిత్రం . వారి మరణం గుండెపోటు వల్ల సంభవించిందన  చెప్తున్నా , వారి మీద విష ప్రయోగం జరిగిందని వారి భౌతిక కాయాన్ని చూసిన వారెవరైనా ఒప్పుకుంటారు . వారి మరణం భరత మాతకు తీరని లోటుగా మిగిలి పోయింది .

సేకరణ..

పి. రామ ప్రసాద్.

No comments: