Wednesday, April 12, 2017

థైరాయిడ్(హైపో థైరాయిడ్)కు చెక్ పెట్టే వన్ అండ్ ఓన్లీ హెల్తీ డ్రింక్..!! best health drinks for Thiroid

థైరాయిడ్(హైపో థైరాయిడ్)కు చెక్ పెట్టే వన్ అండ్ ఓన్లీ హెల్తీ డ్రింక్..!!
----------------------------------------------------------------------

తీసుకునే ఆహారంలో సరైన జాగ్రత్తలు తీసుకుంటే హైపోథైరాయిడిజంకు తప్పకుండా చెక్ పెట్టవచ్చు.. మరి వీటి కాంబినేషన్ లోని డ్రింక్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం..

ప్రస్తుత రోజుల్లో థైరాయిడ్ చాలా ప్రమాధకమైంది కనబడుతోంది. చాలా మంది థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు.ముఖ్యంగా ఈ థైరాయిడ్ సమస్యకు ప్రధానకారణం శరీరంలో హార్మోనులు అసమతుల్యత. ఎప్పుడైతే థైరాయిడ్ లెవల్స్ ఎక్కువగా ఉంటాయో, ఆ సమయంలో ఆరోగ్యాని సంబంధించి అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది.

చాలామంది హైపో థైరాయిడిజమ్ లక్షణాలతో బాధపడుతున్నారు. థైరాయిడ్ గ్లాండ్ మన గొంతు పరిమాణంను బట్టి.. బట్టర్ ఫ్లై ఆకారంలో ఉంటుంది. శరీరంలో హార్మోన్లను ఉత్పత్తి చేయడంలో ఇది కీలకపాత్ర పోషిస్తుంది. ఈ హార్మోన్స్ మెటబాలిజంపై ప్రభావం చూపుతాయి. ఒకవేళ ధైరాయిడ్ గ్లాండ్ సరైన మొత్తంలో హార్మోన్లను ఉత్పత్తి చేయలేకపోతే.. దాన్ని హైపోథైరాయిడిజంగా పరిగణిస్తారు.

సాధారణంగా డైట్ లో సరైన మొత్తంలో ఐయోడిన్ లేనప్పుడు హైపోథైరాయిడిజం సమస్య వస్తుంది. దీనికి ఆటో ఇమ్యూన్ డిసీజ్, థైరాయిడ్ గ్లాండ్ తొలగించడం, రేడియేషన్ ట్రీట్మెంట్, పిట్యూటరీ గ్లాండ్ డ్యామేజ్ అయినప్పుడు థైరాయిడ్ సమస్య వస్తుంది. ముఖ్యంగా థైరాయిడ్ సమస్య ఎక్కువగా మిడిల్ ఏజ్ లేదా వయసు పెరిగిన ఆడవాళ్లలో వస్తుంది.

థైరాయిడ్ లక్షణాలను, సంకేతాలను తెలుసుకోవడం చాలా అవసరం. ఒకసారి దీన్ని చెక్ చేసుకోకపోతే.. అనేక తీవ్ర అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. గోయిటర్, హార్ట్ ప్రాబ్లమ్స్, న్యూరోలాజికల్ ప్రాబ్లమ్స్, ఇన్ఫెర్టిలిటీ, బర్త్ డిఫెక్ట్స్ కి దారితీయవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ థైరాయిడ్ లక్షణాలపై అవగాహన కల్పించుకోవడం చాలా అవసరం.

అలాగే థైరాయిడ్ లేదా హైపోథైరాయిడ్ ను నివారించుకోవడానికి హాస్పిటల్స్ చుట్టూ తిరిగి విసిగి చెందింటే మాత్రం...అలాంటి వారికోసం ఒక అద్భుతమైన హెల్త్ డ్రింక్ ..నేచురల్ డ్రింక్ అందుబాటులో ఉంది. ఇది హైపోథైరాయిడిజంను ఎఫెక్టివ్ గా నివారిస్తుంది. అందుకు మీరు చేయాల్సిందల్లా, క్యారెట్, బీట్ రూట్, పైనాపిల్, సెలరీ మరియు ఆపిల్ తీసుకోవాలి. తీసుకునే ఆహారంలో సరైన జాగ్రత్తలు తీసుకుంటే హైపోథైరాయిడిజంకు తప్పకుండా చెక్ పెట్టవచ్చు.. మరి వీటి కాంబినేషన్ లోని డ్రింక్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం..

క్యారెట్ :
క్యారెట్స్ లో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. బీటా కెరోటీన్స్ కూడా ఎక్కువగా ఉండి, థైరాయిడ్ హార్మోన్స్ ను రెగ్యులేట్ చేస్తుంది. ఫ్రెష్ గా ఉండే క్యారెట్ తీసుకుని, తొక్క తీసి చిన్న ముక్కలు గా కట్ చేసుకోవాలి.

బీట్ రూట్ :
బీట్ రూట్ లో ఫైబర్ ఎక్కువ. థైరాయిడ్ ఫంక్షన్స్ ను రెగ్యులేట్ చేస్తుంది. ఫ్రెష్ గా ఉన్న బీట్ రూట్ తొక్క తీసి, ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.

పైనాపిల్:
పైనాపిల్లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉన్నాయి. యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఎక్కువే. వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.

ఆపిల్స్ :
ఆపిల్స్ లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది బాడీని డిటాక్సిఫై చేస్తుంది. థైరాయిడ్ హార్మోన్స్ ను రెగ్యులేట్ చేస్తుంది. ఒక ఫ్రెష్ ఆపిల్ తీసుకుని, వాష్ చేసి, చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.

సెలరీ:
కొత్తమిరీ వ్యాధినిరోధకతను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అలాగే థైరాయిడ్ హార్మోన్స్ ను క్రమబద్దం చేస్తుంది. కొత్తమీర రెండు కాడలు తీసుకుని క్లీన్ గా శుభ్రం చేసుకోవాలి. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఈ కాంబినేషన్ లో హెల్తీ డ్రింక్ తయారీ:
పైన సూచించిన పదార్థాలన్నీ ఒక బ్లెండర్ లో వేసి బాగా బ్లెండ్ చేయాలి. సరిపడా నీళ్లు చేర్చి ఈ జ్యూస్ ను రోజుకు ఒక్కసారి తాగితే చాలు హైపోథైరాయిడిజం లక్షణాలు త్వరగా తగ్గిపోతాయి. ఫ్యూచర్ లో కూడా మళ్లీ రాకుండా నివారిస్తుంది.


No comments: