Saturday, March 11, 2017

pasu aayurvedamu పశు ఆయుర్వేదం

పశు ఆయుర్వేదం :
------------------

  ఆవులు, గేదెలు పాలు ఎక్కువ ఇవ్వడానికి  -

     నల్లేరు చెట్టు చిగురాకులు , జీలకర్ర సమాన భాగాలుగా మజ్జిగతో కలిపి నూరి ఆవు లేక గేదె కి లొపలికి మింగించిన పశువులకు పాలు ఎక్కువ అవుతాయి. మోతాదు 10 గ్రాములు . నెలకి 4 సార్లు చేయాలి .

  పశువుల పాలల్లో వెన్న పెరగడానికి -

      " శంఖపుష్పి " అనే మూలికాని సంపాదించి దానిని నీటితో నూరి రసం తీసి ఆ రసాన్ని లేక కాల్చిన శంఖపుష్పి భస్మాన్ని ఏదో ఒకదాన్ని మాత్రమే పాలుపితికే పాత్రకి లోపలి వైపు , అంచులకు లేపనం చేసి తరువాత పాలు పిండితే ఆ పాత్రలో పిండిన పాలలొ వెన్నశాతం ఎక్కువగా ఉంటుంది.తాగిన వారికి కూడ ఎటువంటి సమస్య రాదు.

                 అదేవిదంగా పశువుల మెడకు ముత్తవ పులగం వేరు కాని , ముళ్ల గోరింట వేరు కాని సాధించి దానిని పశువుల కంఠానికి కడితే ఆ పశువుల యొక్క పాలలో వెన్న అధికంగా ఉంటుంది.
 

  పశువులకు గర్భం రాకపోతే  -

        లక్ష్మణ ( వెలి ములక ) చెట్టు వేరుని తెచ్చి మెత్తగా నమిలి ఆ నమిలిన పదార్థాన్ని పశువుల మర్మావయములో సుతిమెత్తగా లెపనమ్ చేయాలి . ఇలా చేయడం వలన ఆ పశువు తొందర్లో చూలు కడుతుంది.

 పశువుల నేత్ర రోగాల కొరకు  -

      పశువులు ఎలాంటి నేత్ర రోగానికి గురి అయ్యినా కూడ వెంటనే వెన్న  గోరువెచ్చటి వేడి నీరు కలిపి కాని గురువింద గింజలని నీళ్లతో అరగదీసిన గంధాన్ని గాని వాటి కళ్లలో కాటుకలా పెడితే నేత్రరోగాలు అన్ని హరించి పోతాయి .

   పశువుల అకాల మరణ నివారిణి  -

       ఏనుగు ఎముకని తెచ్చి పశువుల ని కట్టేసే దొడ్లో పాతిన లేక ఏనుగు మూత్రాన్ని పశువులకు తాగించిన పశువులకు అకాల మరణ భయం లేకుండా పోతుంది .

   పశువుల పుండ్లు మానుట కొరకు  -

       కుక్క , గేదె , ఆవు , గుర్రం , గాడిద , మేక , గొర్రె మొదలయిన పశువుల ఒంటిపై ఎక్కడ వ్రణాలు లేచినా పిచ్చి పుచ్చకాయ రసాన్ని కాని , పిచ్చి కుసుమ ఆకుల రసాన్ని కాని పుండ్ల పైన పిండితే పురుగులు చచ్చి పుండ్లు మానిపోతాయి .

   పశువుల ముఖరోగం హరించడానికి  -

        పశువుల ముఖరోగానికి గురిఅయ్యినప్పుడు  వాటి ముఖాన్ని వేడినీటితో కాని , ఆవనూనేతో కాని సబ్జా చెట్టు ఆకురసంతో కాని కడుగుతూ ఉంటే ముఖరోగం నివారించ బడుతుంది .

    పశువులకు మాయ పడకపోతే  -

        కొన్ని పశువుల ఈనిన తరువాత మాయ వేయవు . అలాంటి పరిస్థితిలో గురుగింద గింజని రెండు ముక్కలుగా పగలకొట్టి ఒక ముక్కని పశువుల నోట్లో , మరొక ముక్కని పశువుల యోని లో ఉంచితే దాని ప్రభావం వలన మాయ జారిపడుతుంది .

************ కాళహస్తి వెంకటేశ్వరరావు ************

No comments: