Tuesday, February 21, 2017

true story

మన ఇళ్ళల్లో లక్స్, డావ్, లిరిల్ , జాన్సన్ అండ్ జాన్సన్ , పియర్స్, ఇలా ఎన్నోరకాల సబ్బులు వాడుతున్నాం . ఎందుకు వాడుతున్నాం ?
.
 ఒకసారి ఒక మిత్రుడిని అడిగాను .
ఆయన అన్నాడు " మాధురీ దీక్షిత్ వాడుతుంది , హేమ మాలిని వాడుతుంది " అని .
.
 వారు నూతిలో దూకుతాము అంటే మనమూ దూకుతామా ?
.

మూర్ఖత్వం చూపకండి . మీకు తెలుసో తెలియదో మాధురీ దీక్షిత్, హేమ మాలిని సబ్బుతో స్నానం చెయ్యరు .
.

మీరు అడుగవచ్చు " నీకెలా తెలుసు" అని
.

బొంబాయి లో నేను ఒక ఉపన్యాసం చెప్పాను . అది జుహూ లో చెప్పాను . అది సినిమా వాళ్ళు ఎక్కువగా ఉండే ప్రాంతం . అది ఎలా జరిగిందంటే ఒకసారి ధర్మేంద్ర నా ఉపన్యాసం కేసెట్ విన్నారు . నాకు ఫోన్ చేశారు .
.

" నేను ధర్మేంద్ర మాట్లాడుతున్నా ! నేను రాజీవ్ దీక్షిత్ తో మాట్లాడొచ్చా?"
" చెప్పండి . నేనే "
మీ కేసెట్ విన్నాను . మొత్తం 10 కాసెట్స్ వినడానికి 10 గంటలు ఇంటికి వెళ్ళకుండా కారులో 10 గంటలు ప్రయాణం చేస్తూ విన్నాను . ఇంటికి కూడా వెళ్ళలేదు మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను . మీ ఉపన్యాసం ఏర్పాటు చెయ్యాలనుకుంటున్నాను . మీ ఫీజ్ ఎంత ?
.

నేను ఫీజ్ తీసుకోనండి" మీరు సినిమా వారితో ఒక మీటింగ్ ఏర్పాటు చెయ్యండి . " నేను వచ్చి మాట్లాడతా "
ఆయన అంగీకరించి ఆయన ఇంటిలో( " లోనవాలా ")  ఏర్పాటు చేశారు . 25 -30 మంది వచ్చారు .
వారు నన్ను అనేక ప్రశ్నలు అడిగారు . నేను సమాధానాలు చెప్పాను .
.
 నేను వారిని లక్స్ , లైఫ్బోయ్ , లిరిల్ తో స్నానం చేస్తారా అని అడిగా ?
చెయ్యం అని చెప్పారు
.

మరి రోజూ స్నానం చేస్తారా అని అడిగా
.

చేస్తామని చెప్పారు . దేనితో చేస్తారు ?
.

" శనగ పిండిలో మీగడ వేసుకుని దానితో స్నానం చేస్తామని చెప్పారు "
.

" అలా అయితే అందరికీ ఈ విషయం చెప్పొచ్చు కదా ?"
.

భయం వేస్తోంది
ఎందుకు ?
అందరూ హేమా మాలిని ఐపోతే ఎలా ? నా కుర్చీ కే ఎసరు పెట్టేయ్యరా ?
ఒక విషయం చెప్తున్నా . హీరోయిన్ లు ఎవరూ సబ్బుతో స్నానం చెయ్యరు . కారణం ఏమిటంటే సబ్బు లో కాస్టిక్ సోడా ఉంటుంది . అది చర్మాన్ని పాడు చేస్తుంది . శీతాకాలం లో సబ్బుతో స్నానం చేశాక చర్మం తెల్లగా అయిపోతుంది . దానివలననే . ఎన్ని నీళ్ళు పోసి కడుక్కున్నా అది పోదు
.

మరి ఏది మంచిది ?
.

ముల్తాని మట్టి . అది ఈ దేశం లో ఇంకా దొరుకుతూనే ఉంది . రాత్రి దానిని పెరుగులో కాని , మజ్జిగ లో గాని నాన బెట్టండి , ప్రోద్దునకి మెత్తగా అవుతుంది . దానితో రుద్దుకోంది . లేదంటే శనగ పిండి , పెరుగు మిశ్రమం , కాదంటే ఎర్ర కంది పప్పు " మస్సోర్ కి దాల్ " లో తేనె కలిపి స్నానానికి వాడండి . గోవు పేడ తో చేసే సబ్బు ఉపయోగించండి . పూర్వం రాజులు యజ్ఞం చేసే ముందు గోవు పేడ తో స్నానం చేసి అప్పుడు యజ్ఞం చేసే వారని గ్రంధాలలో నేను చదివాను . మీ ఇంట్లో దేశీ ఆవు ఉంటె దాని పేద తో స్నానం చెయ్యండి . లేదంటే మీ అకోలాలో తయారయ్యే ఆ సబ్బు తో స్నానం చెయ్యండి . నేను ఇదివరకు ఇక్కడకు వచ్చినపుడు కొన్ని కొని నేను వాడాను . ఇతరులకు ఇచ్చాను . మీరు ఆ సబ్బులు కొంటె మీ డబ్బులు ఎక్కడకు వెళ్తాయి ? మీ ఊళ్లోనే ఉన్నాయి , దానిని తయారు చేస్తున్న గోశాలకు వెడుతున్నాయి , అక్కడ కొందరికి ఉపాధి దొరుకుతుంది . అలా గ్రామగ్రామాన , వీధి వీధిలో గోశాల స్తాపించాబడాలి .
ఈ గోశాలల వల్ల భారత ఆర్ధిక వ్యవస్థ బలపడుతుంది . ఇలా మనం భారత దేశం లో కోట్ల రూపాయలను పొదుపు చెయ్యగలం . అది నా చిన్న విజ్ఞప్తి

.
ఇది  శ్రీ  రాజీవ్   దీక్షిత్   హిందీ  ప్రసంగం  యొక్క  అనువాదం.

No comments: