Wednesday, February 22, 2017

About Goseva world-telugu



1. గోసేవ వరల్డ్ ప్రారంభించినది దేని కోరకు

 2.గోసేవ వరల్డ్ ఎలా పుట్టింది-స్థాపించటానికి ముఖ్య కారణాలు- లక్ష్యాలు

3.మనస్సు ను కలిచివేసిన సంఘటనలు

4. గోసేవ వరల్డ్ అండ్ ప్రోజెక్ట్ ప్లాన్ డిజైన్ చేయబడింది ఇలా (నిద్ర లేని రాత్రులతో)

5. గోసేవ వరల్డ్ ప్రాజెక్ట్ ప్లాన్ లక్ష్యంలో ఉన్న ముఖ్యాంశాలు
సాధనాత్ సాద్యతే సర్వం.

6. గోసేవ వరల్డ్ అందరి కోసం ఎందుకు..

7.గోవు మనతో మాట్లాడితే...?

8. గోసేవ వరల్డ్-ఆప్ గురించి మరియు అంకితము

 9.నా కృతఙ్ఞతలు మరియు నమస్కారములు

10. ఉచితము అయినప్పటికీ నేను ఎందుకు సపోర్ట్ చెయ్యాలి?
  **నమ్మలేని/ఒప్పుకోలేని నిజాలు

11.ఇక సహకరించడము మీ చేతుల్లో!!
“Goseva world” ను మరింత బల పరచడానికి సలహాలు స్వీకరించబడును.

12.సంప్రదించవచ్చు-లైక్-జాయిన్-ఫాలో-మద్దతు తెలుపవచ్చు.


గోసేవ వరల్డ్ ప్రారంభించినది దేని కోరకు:
*************************
దేశానికి వెన్నుముక రైతు, అన్నము పెట్టె రైతుకు వెన్నుముకైయినటువంటి, పాడి -పంటలకు ఆధారమైన ఆవు-ఎద్దులను కాపాడటం కోసము ప్రారంబించినదే గోసేవ వరల్డ్.
దేశానికి రక్షణ సైనికుడు,దేశానికి వెన్నుముక రైతు-అందరికి అన్నము పెట్టేవాడు.

మనం కంటి నిండా నిద్ర పోతున్నాము అంటే సైనికుడి వల్ల అయితే, కడుపు నిండా తిండి తింటూ స్వేచ్ఛగా ఉండగలగుతున్నాము అంటే, రైతు వల్లనే! ఆవు -ఎద్దు(పాడి-పంటలు) రైతుకు ఆధారము.

మన అందరికి ఆవు పాల ఉత్పత్తులు లేకుండా రోజు గడవదు. గోవుని కాపాడుకుండటం ద్వారా అందరికి చక్కటి ఆరోగ్య వంతమైన జీవనాన్ని ఇవ్వడమే గోసేవ వరల్డ్-ఫార్ములా, అంటే అన్నిసమస్యలకు పరిష్కారము.

"ఒక దేశం యొక్క గొప్పతనాన్ని మరియు నైతిక పురోగతిని, ఆ జాతి జంతువుల పట్ల ఎలా ప్రవర్తిస్తుందో చూసి అంచనా వేయవచ్చు. నా దృష్టిలో గోవు/ఆవు సంరక్షణ అంటే నిస్సహాయంగా మరియు బలహీనంగా ఉండే ప్రాణులను సంరక్షించుట"-    మహాత్మా గాంధీ

గోసేవ వరల్డ్ ఎలా పుట్టింది-స్థాపించటానికి ముఖ్య కారణాలు- లక్ష్యాలు:
**********************************************


అది 2004 వ సంవత్సరం, కాలేజ్ చదువుతున్న రోజుల్లో మొదటిసారి మా లెక్చరర్ shaik sharif khan తరుచుగా వీధిలో వుండే ఆవులు ప్లాస్టిక్, క్యారీబ్యాగ్ లు తింటున్నాయి అవి మనం నిత్యం వాడే ప్లాస్టిక్ బ్యాగులలో, కిచెన్ వేస్ట్ వాటిలో నింపి డస్ట్ బిన్స్ లొ వేయడం కారణంగా వాటి చావుకి మనం కారణం అవుతున్నాము . ఇవి కడుపులో ఉండి పోయి విపరీతమైన భాదతో చనిపోతున్నాయి అని తరచుగా చెబుతూ వుండేవారు.
కాని ఈ విషయంపై ఎక్కువగా ఆలోచన చెయ్యాలని అనిపించలేదు బహుశ  ఏ అనుభవం దగ్గరగా కనపడలేదు కనుకనేమో  !ఇలాంటి పరిస్థితి కొన్నింటికి మాత్రమే  అయ్యిఉండవచ్చు అని అనుకున్నాను.    

మనస్సు ను కలిచివేసిన సంఘటనలు:
*************************
కొన్ని సంవత్సరాల తరువాత నిద్రను మేలుకోలిపే రోజులు ఈ క్రింది సంఘటనలతో కళ్ళముందు నిలబడ్డాయి.
ఆవులు వాల్ పోస్టర్లు,క్యారీ బ్యాగ్ లు,కాయిన్ లు ,ఇసుక, చెప్పులు ఇంకా చెప్పకూడని విషయం ఏంటంటే ఉపయోగించి పారేసిన న్యాప్కిన్ ప్యాడ్లు తినడం, ఇవే కాకుండా ,బీఫ్ కోసము బీఫ్ షాపులు దగ్గర నిలబడటం, రోడ్ మీద జరిగే  ఏక్సి డెంట్ లలో చనిపోవడం చెన్నై మరియు ఇతర పరిసర ప్రాంతాల్లో చూశాను.ఇది  కేవలము చెన్నై లోనే కాదు దేశము మొత్తం ఇదే దుస్థితి అని google చెబుతుంది.పవిత్రమైన జంతువుల కోసము"కరుణ సొసైటీ " సంస్థ ద్వారా విదేశీ మహిళ పోరాటం చేయటాన్ని ఆశ్చర్యం కలిగించింది.

"The Plastic cow" అందరూ తప్పక చూడవలసింది.50 కిలోలు పైగా ప్లాస్టిక్ వ్యర్దాలను ఆవుల కడుపులో నుండి ఆపరేషన్ చేసి బయటికి తియ్యడం ప్రత్యక్షంగా చూపించారు.
మనకి కంటి లో నలుసు పడితే ఉండే భాధ  ఒక ఎత్తైతే, ఏ కారణము చేతనైన కడుపు నొప్పి వస్తే ప్రాణము పోయే అంత పని అయ్యింది అంటాము.మరి గోమాత గా పిలవబడే పవిత్రమైన గోవు ఎవరికీ చెప్పుకోలేక ఎంత భాధను అనుభవిస్తుంది అనే ఆలోచన నుంచే పుట్టిందే గోసేవ వరల్డ్ .

గోసేవ వరల్డ్ అండ్ ప్రోజెక్ట్ ప్లాన్ డిజైన్ చేయబడింది ఇలా (నిద్ర లేని రాత్రులతో)  :
**************************************************
మన దేశీ ఆవులను,ఎద్దులను కాపాడటం కొసం నా వంతు భాద్యతగా  వినూత్న మైన ప్రోజెక్ట్ ప్లాన్ ని ఆచరణ లో పెట్టటమే లక్ష్యంగా స్థాపించినదే గోసేవ వరల్డ్.

ఈ ప్రోజెక్ట్ ప్లాన్ కేవలము మతం కోసం కాదు,ప్రతీ ఒక్కరికి ఆమోదయోగ్యంగా ఉంటుంది అని మరియు ఎన్నో రకాలైన లాభాలున్నాయని, ఆవులను-ఎద్దులను కాపాడుకోవడం ఎంత అవసరమో చెబుతూ  డిజైన్ చేయబడినదే గోసేవ వరల్డ్ ప్రోజెక్ట్ ప్లాన్. ఈ ప్రోజెక్ట్ ప్లాన్ ప్రతీ రాష్ట్రనికి కావలసింది. ఇది సామాన్యుడి నుండి వచ్చిన అసామాన్యమైన ఆలోచన.ప్రోజెక్ట్ ప్లాన్ key points ని వీడియో ద్వారా తెలుసుకోవచ్చు  లేదా తదుపరి అంశములో  చదువ వచ్చు.
Goseva world key points:
http://youtu.be/mZ4udcd6UVM

మనిషికి అక్కరలేనిది మాత్రమే తిని,నిత్యమూ ఉపయోగ పడుతూ  అందరికి జీవన ఆధారమైన పవిత్రమైన జంతువులను కాపాడటం అంటే కూడా దేశాన్ని కాపాడటమే, అది కూడా అసలైన దేశ భక్తియే.  గోసేవ వరల్డ్…విలువల(values) పట్ల దయచూపి(kindness) నిలబెట్టు(support).

***ఆవు మన అందరిది అని అందాము- చెబుదాం****

గమనిక: గోసేవ వరల్డ్ ఏ వ్యక్తిని గాని,ఏ మతాన్ని గాని ఉద్దేశించి విమర్శించేది కానే కాదు. కేవలము మతపరమైన అంశాలతో మాత్రమే కాకుండా విజ్ఞాన శాస్త్రము,మరెన్నో వాస్తవాలను మన విలువలు-దయ-మద్దతులతో తెలియచేసేది.  గోసేవ వరల్డ్ ప్రాజెక్ట్ ప్లాన్ మొత్తం ఆవులను కాపాడుతూ ప్రతి ఒక్కరి కి మంచి జీవనాన్ని ఎలా ఇవ్వవచ్చు అని చెబుతూ డిజైన్ చేయబడింది.


గోసేవ వరల్డ్ ప్రాజెక్ట్ ప్లాన్ లక్ష్యంలో ఉన్న ముఖ్యాంశాలు:
***********************************
దేశములో ఉన్న గోవులను కాపాడటం ద్వారా మనము పొందే లాభాలు క్లుప్తంగా ...
అవగాహాన - ఊహకు అందని అద్భుత అంశాలపై
ఉద్యోగాలు కల్పించడము
విద్య ని అందించడము
ఈ తరము,రాబోవు తరాలకు
నీటిని పొదుపు చేయడము పై దృష్టి
భద్రత పై దృష్టి మరియు నిఘా
రక్షణ కల్పించడము పై దృష్టి
మంచి ఆరోగ్యాన్ని,సంపదను సృష్టించడము
అన్ని వృత్తులవారు, మతాల వారు కులాలవారు, భాషల వారు అందరు ఒక్కచోట కలిసే చోటు గోసేవ వరల్డ్
విలువలు,దయ,మద్దతును  తెలియచెప్పేది.
ఇంకా ఎన్నో
ప్రతి అంశము ఎన్నో ఉపయోగాలతో చక్కటి మరియు ఖచ్చితమైన వివరణ ఉన్నదీ. చెప్పింది చేసే దిశ గా ఉండే అద్భుతమైన ప్రాజెక్ట్ ప్లాన్ ఇది. వినూత్నమైన,ఊహాకు అందని

గోసేవ వరల్డ్ ప్రోజెక్ట్ ప్లాన్ అంటే :
*******************

ఉద్యోగాలు,ఆరోగ్యం,పర్యావరణం,భద్రత,ఆహ్లాదం,విద్య,ఆనందం,సంపదను కల్పించి ఈ తరానీకీ ఆదర్శము గా రాబోయే తరానికి బాటలు వేద్దాము!
కేంద్ర ప్రభుత్వ సహకారము అనుమతులతో అన్ని రాష్టాలలో అమలు చేయడానికి అర్హత కలిగిన, ఆదాయాన్ని ఉద్యోగాలను కల్పించ కలిగే ప్రాజెక్ట్ కేవలము ఆవులను సంరక్షించడము ద్వారా ఫలితము. గోవులను కాపాడటం అంటే కూడా దేశాన్ని కాపాడటమే అసలైన దేశ భక్తి కదా! అవకాశం ఇవ్వండీ ఆచరించి చూపిస్తాం! సాధనాత్ సాద్యతే సర్వం..ఈ ప్రాజెక్ట్ ప్లాన్ ను మరింత బల పరచడానికి సలహాలు స్వీకరించబడును.

***ఆవు మన అందరిది అని అందాము-చెబుదాం****

గోసేవ వరల్డ్ అందరి కోసం ఎందుకు..
***********************
మేము సైతం పాడి-పంటల-రైతు కోసం అంటే అందరి కోసం…

గోవు మనతో మాట్లాడితే...?
******************
మన దేశము వ్యవసాయ దేశము,పాడికి అవసరమయ్యే మేము(ఆవులు)  మీ మతాన్ని గానీ కులాన్ని గానీ చూసి పాలని ఇవ్వము.మమ్మల్నీ ఆదరించే వారికీ,ప్రేమించే వారికి మాత్రమే కాదు మమ్మల్ని విమర్శ చేసేవారికి మరియు కసాయికి సైతం కూడా మా పాల ఉత్పత్తులు లేకుండా రోజు గడవదు.మేము మనుషులకూ(చిన్నవారైనా-పెద్దవారైనా, ధనవంతులైన-పేద వారైనా, మంచివారైనా-చెడ్డవారైనా ,సంతోషముతో ఉన్నా-భాధలో ఉన్న ,ఏ వృత్తి వారైనా ,ఏ భాష వారైనా,గెలుపు లో ఉన్న-ఓటమి లో ఉన్నా),దేవతలకు,అందరికీ మేమే ఆధారము.ఆలాగే వ్యవసాయానికి నిత్యం ఉపయోగపడే ఎద్దులు కూడా అంతే!
దేశానికి అన్నము పెట్టె రైతు అంతే. దేశానికి తన ప్రాణాలను పణంగా పెట్టి రక్షణ కల్పించే సైనికుడు కూడా అంతే, సైనికుడికి కూడా అన్నము పెట్టేది మన ఒక రైతు మాత్రమే!మానవ తప్పిదాల వల్ల పాడి పంటలకు, రైతుకు ఈ దుస్థితి.


మనిషికి అక్కరలేనిది తిని నిత్యం అందరికీ ఉపయోగపడే గోవుని గౌరవిద్దాం.రండి చేయి చేయి కలపండి.మొత్తం గోసంపదని గోసేవ వరల్డ్ ద్వారా కాపాడుకుందాము. ఆవులని కాపాడటం అంటే కూడా దేశాన్ని కాపాడటమే.


గోసేవ వరల్డ్ ప్రోజెక్ట్ ప్లాన్ అంటే ఉద్యోగాలని,ఆరోగ్యాన్ని,చక్కటి పర్యావరణన్ని,విద్య,భద్రత, అపారమైన సంపదను,కల్తీ లేని సమాజన్ని మనకు మన పిల్లలకు మనదేశానికి నెలకోల్పుదాము.ఇది మన ద్వారా సాద్యం.ఈ రోజుల్లో గోవులకు జరిగే అన్యాయం పట్ల చిన్నవారి నుండి గోప్పవారి వరకు ప్రతిఒక్కరికి ఆందోళన కలిగించే సమస్య.
ఈ సమస్య కు పరిష్కారం గోసేవ వరల్డ్ ప్రోజెక్ట్ ప్లాన్ తొ సాధ్యం అవుతుంది.ఇది సామాన్యుడి నుండి వచ్చిన అసామన్యమైన ఆలోచన.గోసేవ వరల్డ్ (విలువలపట్ల దయచూపి నిలబెట్టు).

****జై జవాన్ -జై కిసాన్-జై గోమాత***ఆవు మన అందరిది అని అందాము\ చెబుదాం****


గోసేవ వరల్డ్-ఆప్ గురించి మరియు అంకితము:
*****************************
గోసేవ వరల్డ్ ఆప్ లో ఆవు\గోమాత గురించి ఎన్నో అద్భుతమైన విషయాలను కేవలము మతము గురించి మాత్రమే కాకుండా సైన్సు\విజ్జ్ఞాన శాస్త్రము,వైద్య శాస్త్రము ,ఆయుర్వేదం,
నిత్య జీవితము లో పొందే ఉపయోగాలను సులభంగా వివిధ భాషలలో మొట్ట మొదటి సారి వివరించడము జరిగింది.

అంకితము: సృష్టి మొదలు,ప్రస్తుత మరియు కాబోయే ఆవు\గోమాత ప్రేమికులకు ఈ ఆప్ మరియు గోసేవ వరల్డ్ అంకితము.
***Vishnu-विष्णु- విష్ణు- விஷ்ணு- ವಿಷ್ಣು -വിഷ്ണു**


నా కృతఙ్ఞతలు మరియు నమస్కారములు:
**************************
 ఈ ఆప్ ద్వారా అద్భుతమైన మైలు రాయిని చేరుకోవడానికి, గోసేవ వరల్డ్ స్థాపనకు సహకరించి,ప్రోత్సహించిన నా ప్రత్యక్ష దైవాలైన నా తల్లి దండ్రులకు,ఇష్ట దైవాని కి,గోసేవ వరల్డ్ టీమ్ కు, గొప్ప వ్యక్తులకు ,నా తోటి మిత్రులకు,బంధువులకు,నన్ను ఇష్ట పడే వ్యక్తులకు,విమర్శకులకు నా కృతఙ్ఞతలు ... భగవంతుడు అందమైన గోవులను కాపాడుకునే ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చాడని భావిస్తూ... ఇక  గోసేవ వరల్డ్ ను ప్రాజెక్ట్  ప్లాన్ ను విజయ  పథకానికి తీసుకెళ్లడమే మన ముందున్న కర్తవ్యం. ఇక సహకరించడము మీ చేతుల్లో!!

Vishnu-विष्णु- విష్ణు- விஷ்ணு- ವಿಷ್ಣು -വിഷ്ണു
****ఆవు మన అందరిది అని అందాము-చెబుదాం ******

ఉచితము అయినప్పటికీ నేను ఎందుకు సపోర్ట్ చెయ్యాలి?
**********************************
నేను గోసేవ వరల్డ్ కు సపోర్ట్ చేయకపోతే ఏమవుతుంది?

నమ్మలేని/ఒప్పుకోలేని నిజాలు:
*******************

దేశములో ఎన్నో గోశాలలు,ఆవులను కాపాడడానికి ఎంతో కృషి చేస్తున్నాయి . అదేవిధముగా ఎన్నో ఆవులు-ఎద్దులు మాంసముల కోసము రోజుకు 50వేలకు పైగా కొన్ని వేల కబేళాలలో చంపబడుతున్నాయి..ఈ రెండు జరిగేది మన భారత దేశములోనే !! మనము నిత్యమ ఉపయోగించే ప్లాస్టిక్ కారణము గా ప్రతీ రోజు వేలల్లో,మరి ఇంకా ఇతర కారణములతో ఆవులు చని పోతున్నాయి ..ఇవి కూడా మన భారత దేశము లోనే!!
అందుకే గోసేవ వరల్డ్ కొత్త అధ్యయానికి మాస్టర్ ప్లాన్ తో ముందుకు వచ్చింది.ఈ రోజు ఆవులకు జరిగే అన్యాయము పట్ల చిన్న వారి నుండి పెద్ద వారి వరకు ఆందోళన కలిగించే సమస్య-ఇది గోసేవ వరల్డ్ తో పరిష్కారము అవుతుంది. ఇది ఒక్కరి సంతకము తో\ కేంద్రప్రభుత్వ సహకారముతో సాధించుకునే ప్రాజెక్ట్ మరియు ఈ తరము మరియు భావితరాలను(అంటే మీ పిల్లలను) కాపాడే  దీర్ఘకాలికమైన ప్రాజెక్ట్.గోవులను కాపాడటం అంటే కూడా దేశాన్ని కాపాడటమే అసలైన దేశ భక్తి కదా!
సాధనాత్ సాద్యతే సర్వం.
ఇక సహకరించడము మీ చేతుల్లో!!

ఈ క్రింది వాటి లో ఎవరైనా  “Goseva world” ను మరింత బల పరచడానికి సలహాలు స్వీకరించబడును.
సంప్రదించవచ్చు-లైక్-జాయిన్-ఫాలో-మద్దతు తెలుపవచ్చు.
Join, Be like,follow,support us for free.
https://Gosevaworld.blogspot.in
www.Facebook.com/Gosevaworld
YouTube in Goseva world  
Gmail: Gosevaworld@gmail.com
Whats app group-9677268155/7093406444
We feel, God has given us a beautiful opportunity to work for a great animal.
Regards, Vishnu and Team @Goseva world



This App will be available after march 2017 on words.


 ఈ ఆప్ ను March 2017 నుండి play store లో ఉంచడానికి ప్రయత్నమూ చేస్తున్నాము.

No comments: