Tuesday, February 21, 2017

ఆవు…వేదన !!! aavu vedana

ఆవు…వేదన !!!


నాయనలారా…మిమ్మల్నే….!
పిలిచేది ఎవరా అని ఆశ్చర్యపోతున్నారా…? మీకు అమ్మపాలు లేక… గుక్కపట్టి ఏడుస్తుంటే… అమ్మపాల బదులు నా పాలు తాగి పెరిగారు గుర్తులేదా..! ఇప్పటికీ పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, మీగడలతో… ఇలా నా పాలతోనే తయారయ్యే అనేక రకాల ఉత్పత్తులతో కండలు పెంచుకుంటున్నారే…! ఆ ఆవునే నేను. దేవుడు ప్రతిచోటా ఉండలేక తల్లిని సృష్టించాడంటారు…ఆ అమ్మేలేని పసిబిడ్డలకు ఆవుపాలు ఎందుకు పోస్తారో తెలుసా…? ఆవుపాలతో బిడ్డ బతికి బట్టకడుతుందని నమ్మకం… అదే నా ప్రత్యేకత. అలాంటిది నన్ను కోసుకుని తింటారా…?
నేను ఏ రోజైనా నోరు తెరచి మిమ్మల్ని ఏదైనా అడిగానా…? ఇంత గడ్డి తిని…ఇంటిల్లిపాదినీ బతికిస్తున్నాను. పాడిసంపద మాత్రమేకాదు నాయనా…! గోమూత్రం, గోమయం…ఇలా నా శరీరంలోని అణువణువూ మీ కోసం… మీ ఆరోగ్యకరమైన జీవనం కోసం … మీ ఇంట్లో సిరులు కురిపించే పంటల కోసం… ధారవోస్తుంటే… అదీ చాలదని నన్ను వండుకుని తింటారా…? పైగా “ బీఫ్ ఫెస్టివల్” అంటూ అమ్మలాంటి నన్ను చంపుకుతినటం… మీకో పండుగా…..?
ఎర్రటి ఎండలో పెట్టినా… మీకు చల్లని మజ్జిగనిస్తున్నా… హోరుమనే వానలో నేను వణికిపోతున్నా…. మీకు మాత్రం వేడివేడి పాలనిస్తున్నా… దొరికిన చెత్తాచెదారమేదో తిని…మీకు మాత్రం పుష్టికరమైన పాడినిస్తున్నా….! చుర్రుమనే కారంతో మీ నోళ్లు మండితే…కమ్మని నెయ్యిని కూడా నేనే ఇస్తున్నా…. మరి నేనేం పాపం చేశానని…నాకీ చిత్రవధ….?
ఏనాడైనా మిమ్మల్ని పొడిచానా…కరిచానా… కనీసం బెదిరించానా… భయపెట్టానా…! మీరు అదిలిస్తే…ఏదో నా బిడ్డలే కదా అని ఓ మూలన పడి ఉన్నా కదా…! నా ఆఖరి శ్వాస దాకా మిమ్మల్నే కనిపెట్టుకుని … పాలిచ్చాను…పాలించాను…
అందుకు నాకు ఇదా బహుమతి…! ఇదేనా…నవనాగరికులమని చెప్పుకునే మీరు చూపించాల్సిన కృతజ్ఞత….?
కడుపులో పెట్టుకుని కాపాడే కన్నతల్లిని ఎవరైనా చంపుకుంటారా…? గ్లాసుడు నీళ్లిస్తేనే…. థ్యాంక్యూ..థ్యాంక్యూ..థ్యాంక్యూ … అంటూ ఆకాశానికి ఎత్తేస్తారే…! అలాంటిది మిమ్మల్ని కడుపులో పెట్టుకుని కాపాడే …. నన్ను వండుకుని తినాలనిపించటం మీకు న్యాయమా…? పైగా మీ రుచి కోసం… మీ ఆకలి తీర్చే నన్ను ఆకలితో మాడుస్తారు… తలకిందులుగా వేలాడదీస్తారు… ఒక్కసారి ప్రాణం తీయకుండా…చిత్రవధ చేస్తారు… మనుషులు చేయాల్సిన పనేనా ఇది…?
గోమాతను కాపాడటం అంటే భారతీయ వైభవాన్ని కాపాడుకోవడమే .
గోవులున్న ఇల్లు, గ్రామం, రాష్ట్రం, దేశం సకల సౌభాగ్యాలతో విలసిల్లుతూ ఉంటుంది.
సమస్త సృష్టిలోకి పవిత్రమైన గోమాతను రక్షిద్దాము, పూజిద్దాము సకల శుభాలను పొందుదాము….
ఓం నమో భగవతే గోమాత్రే నమః
గోవు ను జాతీయ జంతువు గా ప్రకటించాలి
గోవు లేకుంటే నాగరికత లేదు
గోమాత ను పూజిద్దాం, రక్షిద్దాం
ఆవు ను కూడా ఆమ్మలా ప్రేమిద్దాం
గోమాత కు మన అండ
గో సంరక్షణ మన జండా
గో సేవ మన అజెండా
ఇది శ్రీ శంకర విద్యాభారతి గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్, హైదరాబాదు వారి
' శ్వాస - ధ్యాస

No comments: