Saturday, January 14, 2017

కనుమ పండగ కర్తవ్యం..kanuma panduga kartvyam


కనుమ పండగ”:

ఈ రోజును “పశువుల పండుగ” అని కూడ అంటారు.
వ్యవసాయదారులు పశువులను నీళ్ళతో కడిగి శుభ్రం చేస్తారు.
పసుపు కుంకుమలతో, పూలతో అలంకరిస్తారు.
పశువులను పూజిస్తారు. పశువుల కొట్టంలో “పొంగలి” వండి
అందులో పసుపు, కుంకుమ కలిపి పొలాలలో చల్లుతారు.
చీడ-పీడలు సోకకుండా కాపాడమని దేవతలను ప్రార్ధిస్తారు.



గుమ్మడి కాయలు పగులకొట్టి పోలి (బలి) వేస్తారు.
పూల దండలు గుచ్చి పశువుల మెడలో వేస్తారు.
దూడల మెడలకు, కాళ్ళకు చిరుగంటలు కడతారు.
ఎద్దు కొమ్ములకు వారి వారి అభిరుచిని బట్టి పసుపు, కుంకుమలు,
రంగులతో తీర్చి దిద్దుతారు. గంగిరెద్దులను అలంకరిస్తారు.
కొన్నిప్రాంతాలలో పశువుల ఊరేగింపు, కోడి పందెములు,
గొర్రె పొట్టేళ్ళ పందెములు కనుమ నాటి సాయంత్రము జరుపుతారు.

“కనుమ” రోజు “మినుము” తినాలని “గారెలు” చేసుకొని తింటారు.
పుట్టింటికి వచ్చిన ఆడపిల్లలు, అత్తింటికి వెళ్ళిన అల్లుళ్ళు కూడ కనుమ రోజు
తిరుగు ప్రయాణమవ్వరు. కనుమ నాడు కాకి కూడ కదలదని సామెత.
కనుమ రోజున మాంసాహారం తినడం ఆంధ్ర దేశాన ఆనవాయితీగా వస్తూంది.
మాంసా హారులు కాని వారు, గారెలుని తింటారు
ఈ నెలరోజులు వాకిట అందమైన ముగ్గులు తో అలంకరిస్తాము కదా.
ఈ కనుమరోజును మాత్రము రధము ముగ్గువేసి ఆరధమును వీదిచివరి వరకు లాగినట్టుగా ముగ్గు వేస్తారు.
దీని అర్ధము సూర్యుడు తన దిశను మార్చుకున్న మొదటిరోజు అని తెలుస్తున్నది.
ఈ కనుమ పండుగను బాగా జరుపుకోవాలి అని తలుస్తున్నాను.అలాగని పసుపక్షులను భాదించకండి

No comments: