Saturday, December 10, 2016

why Goseva world

About Goseva world
-----------------------
_______________________________
గోసేవ వరల్డ్ ని స్థాపించటానికి ముఖ్య కారణాలు:
----------------------------------------------

*అది 2004 సంవత్సరం, కాలేజ్  చదువుతున్న రోజుల్లో మొదటిసారి మా లెక్చరర్ shaik sharif khan Garu తరుచుగా  వీధిలో వుండే ఆవులు ప్లాస్టిక్, క్యారీబ్యాగ్ లు తింటున్నాయి అవి మనం నిత్యం వాడే ప్లాస్టిక్ బ్యాగులలో , కిచెన్ వేస్ట్ వాటిలో నింపి డస్ట్ బిన్స్ లొ వేయడం కారణంగా వాటి  చావుకి మనం కారణం అవుతున్నాము  . 
*ఇవి కడుపులో ఉండి పోయి విపరీతమైన భాదతో చనిపోతున్నాయి అని తరచుగా చెబుతూ వుండేవారు .
కాని ఈ విషయంపై ఎక్కువగా ఆలోచన చెయ్యాలని అనిపించలేదు బహుశ  ఏ అనుభవం దగ్గరగా కనపడలేదు అని ఎమో !ఇలాంటి పరిస్థితి కొన్నింటికి మాత్రమే అని  అనుకున్నాను.    
___________________________
 మనస్సు ను కలిచివేసిన సంఘటనలు:
------------------------------------

కొన్ని సంవత్సరాల తరువాత నిద్రను మేలుకోలిపే రోజులు ఈ క్రింది సంఘటనలతో  కళ్ళముందు నిలబడ్డాయి.

ఆవులు వాల్ పోస్టర్లు ,క్యారీ బ్యాగ్ లు,కాయిన్ లు ,ఇసుక, చెప్పులు ఇంకా చెప్పకూడని విషయం ఏంటంటే లేడీస్ ఉపయోగించి పారేసిన న్యాప్కిన్ ప్యాడ్లు తినడం, కొన్ని ప్రదేశాలలో  ఆడవారు అయ్యి ఉండి బీఫ్ కోసము  బీఫ్ షాపులు దగ్గర నిలబడటం, రోడ్ మీద జరిగే  ఏక్సిటెంట్ లలో చనిపోవడం చెన్నై మరియు ఇతర పరిసర ప్రాంతాల్లో చూశాను.

ఇది  కేవలము చెన్నై లోనే కాదు దేశము మొత్తం ఇదే దుస్థితి అని google చెబుతుంది.
పవిత్రమైన జంతువుల కోసము  "కరుణ సొసైటీ" ద్వారా విదేశీ  మహిళ పోరాటం చేయటాన్ని ఆశ్చర్యం కలిగించింది.

"The plastic cow" అందరూ తప్పక చూడవలసింది.50 కిలోలు పైగా ప్లాస్టిక్ వ్యర్దాలను ఆవుల కడుపులో నుండి ఆపరేషన్ చేసి బయటికి తియ్యడం ప్రత్యక్షంగా చూపించారు.
______________________
గోసేవ వరల్డ్ అండ్ ప్రోజెక్ట్  ప్లాన్:
-------------------------------
మన దేశీ ఆవులను,ఎద్దులను కాపాడటం కొసం నా వంతు భాద్యతగా  వినూత్న మైన ప్రోజెక్ట్ ప్లాన్ ద్వారా ఆచరణ లో పెట్టటమే లక్ష్యంగా స్థాపించినదే గోసేవ వరల్డ్. ఈ ప్రోజెక్ట్ ప్లాన్ కేవలము మతం కోసం కాదు,ప్రతీ ఒక్కరికి ఆమోదయోగ్యంగా ఉంటుంది అని మరియు ఎన్నో రకాలైన లాభాల ఉన్నాయని,ఆవులను,ఎద్దులను కాపాడుకోవడం ఎంత అవసరమో చెబుతూ  డిజైన్ చేయబడినదే గోసేవ వరల్డ్ ప్రోజెక్ట్ ప్లాన్.

ఈ ప్రోజెక్ట్ ప్లాన్ ప్రతీ రాష్ట్రనికి కావలసింది. ఇది సామాన్యుడి నుండి వచ్చిన  అసామ్యన్యమైన ఆలోచన.
ప్రోజెక్ట్ ప్లాన్ key points కొసం క్లిక్ చేయండి.
Goseva world key points: http://youtu.be/mZ4udcd6UVM

**మనిషికి అక్కరలేనిది తిని నిత్యమూ ఉపయోగ పడుతూ  అందరికి జీవన ఆధారమైన పవిత్రమైన జంతువులను కాపాడటం అంటే దేశాన్ని కాపాడటమే, అది కూడా అసలైన దేశ భక్తియే. గోసేవ వరల్డ్...విలువల పట్ల దయచూపి నిలబెట్టు.





No comments: